Forbes 2023 : ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన నలుగురు భారతీయ మహిళలు ఎవరో తెలుసా?

ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేస్తుంది. 2023 లో భారతదేశానికి చెందిన నలుగురు మహిళలు అందులో స్ధానం సంపాదించుకున్నారు.

Forbes 2023 : ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన నలుగురు భారతీయ మహిళలు ఎవరో తెలుసా?

Forbes 2023

Forbes : ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ 2023 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల వార్షిక జాబితాను ప్రకటించింది. అందులో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. భారతదేశంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతున్న ఈ మహిళలు ప్రపంచ వేదికపై తమ పేరును లిఖించుకున్నారు. ఇంతకీ వారెవరంటే?

ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ 2023 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, రోష్నీ నాడార్ మల్హోత్రా 60 వ స్ధానంలో, సోమా మొండల్ 70 వ స్ధానంలో, కిరణ్ మజుందర్ షా 76 వ స్ధానంలో నిలిచారు. డబ్బు, మీడియా, ప్రభావం, ప్రభావ రంగాల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురు మహిళలు వారి వారి రంగాల్లో శక్తివంతమైన మహిళలుగా కీర్తిని సాధించారు.

Kim Jong Crying Viral Video : కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

నిర్మలా సీతారామన్ (64) బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు. 2019 నుండి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. 2017-2019 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. శ్రీమతి ఇందిరా గాంధీ తర్వాత భారతదేశానికి రెండవ మహిళ రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేయడం విశేషం. 2022 లో కూడా నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 36 వ స్ధానంలో నిలిచారు. ఈ సంవత్సరం 32 వ స్ధానం దక్కించుకున్నారు.

రోష్నీ నాడార్ మల్హోత్రా (42) భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన ఈమె హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్మన్‌గా ఉన్నారు. హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడైన శివ్ నాడార్ ఏకైక కుమార్తె అయిన రోష్నీ భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. 2019 లో 54 వ స్ధానంలో, 2020 లో 55 వ స్ధానంలో, 2023 లో 60 వ స్ధానంలో ఫోర్బ్స్ జాబితాలో స్ధానం సంపాదించారు రోష్నీ నాడార్ మల్హోత్రా.

Indian Students : యూఎస్‌లో విద్య అభ్యసించేందుకు ఎగబడుతున్న భారతీయ విద్యార్థులు…వరుసగా మూడో ఏడాది రికార్డ్, ఓడీఆర్ రిపోర్ట్ వెల్లడి

స్టీల్ A చైర్మన్‌గా ఉన్న సోమా మొండల్ (60) భువనేశ్వర్‌లో జన్మించారు. 1984 లో ఇంజనీరింగ్ పూర్తి చేసి మెటల్ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల అనుభవంతో NALCO స్ధాపించి డైరెక్టర్‌గా ఎదిగారు. 2017 లో SAIL మొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్, ఛైర్మన్‌గా ఉన్నారు. 2023 లో ETPrime ఉమెన్ లీడర్ షిప్ అవార్డ్స్‌లో ‘CEO ఆఫ్ ది ఇయర్’ గా సత్కారం అందుకున్నారు. ఇదే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో 70 వ స్ధానం దక్కించుకోవడం గమనార్హం.

కిరణ్ మజుందార్-షా (70) అత్యంత సంపన్నురాలైన వ్యాపారవేత్తగా ఉన్న ఈమె భారతదేశంలోని బెంగళూరులో బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్‌లను స్ధాపించారు. కిరణ్ మజుందర్-షాకు సైన్స్, కెమిస్ట్రీలలో చేసిన సేవకు 2014 లో ఓత్మెర్ డెల్డ్ మెడల్‌తో పాటు పలు ప్రశంసలు దక్కాయి. 2011 లో ఫైనాన్షియల్ టైమ్స్ టాప్ 50 మహిళా వ్యాపారవేత్తల జాబితాలో కూడా చోటు సంపాదించారు. 2019 లో ఫోర్బ్స్ జాబితాలో 68 వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించబడ్డారు. 2020 లో EY వరల్డ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవించబడ్డారు. 2023 ఫోర్బ్స్ జాబితాలో 76 వ స్ధానం దక్కించుకున్నారు.