Kim Jong Crying Viral Video : కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ప్రజలకు వింత వింత రూల్స్ పెట్టి..కఠిన శిక్షలు విధించే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నియంతగా పేరొందిన కిమ్ కన్నీళ్లు పెట్టుకోవటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ప్రజలు ఎలా జీవించాల..,ఎప్పుడు ఏడవాలో..,ఎటువంటి బట్టలు ధరించాలో..ఆదేశించే కిమ్ ప్రజలముందే కన్నీళ్లు పెట్టుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

Kim Jong Crying Viral Video : కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

Kim Jong Un starts crying

Kim Jong Un starts crying : ప్రజలకు వింత వింత రూల్స్ పెట్టి నానా ఇబ్బందులు పెట్టే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నియంతగా పేరొందిన కిమ్ కన్నీళ్లు పెట్టుకోవటం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంచలన వార్త అయ్యింది. ఉత్తరకొరియా ప్రజలు ఎలా జీవించాలో..వాళ్లు ఎప్పుడు ఏడవాలో.. ఎప్పుడు ఏడవకూడదో.. వారి ఎటువంటి బట్టలు ధరించాలో.. ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో ఆదేశించే కిమ్ ప్రజలముందే కన్నీళ్లు పెట్టుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే అత్యంత కఠిన శిక్షలు విధించే కిమ్ తొలిసారిగా కన్నీళ్లు పెట్టుకున్న విషయం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. క్షిపణుల ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడే కిమ్ ఏడ్చాడు అంటే వింతే మరి! ఇంతకీ కిమ్ ఎందుకు ఏడ్చారు..? అదికూడా ప్రజలముందే బహిరంగంగా ఎందుకు ఏడ్చారు..?!

దేశంలో జననాల రేటు అంతకంతకు పడిపోతోందని దీని పరిష్కారం కోసం అందరు ఎక్కువమంది పిల్లల్ని కనాలని మహిళలకు చెబుతు కన్నీళ్లు కార్చారు. కన్నీరు పెట్టుకున్న కిమ్ టిష్యూతో కళ్లు తుడుచుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తుండటంతో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు కిమ్‌ మాట్లాడుతూ.. ‘‘జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని’’ అన్నారు.

యునైటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం ఉత్తరకొరియాలో దశాబ్దికాలంలో సంతానోత్పత్తి రేటు 1.8గా ఉంది. ఇది ఉత్తరకొరియా కొన్ని సరిహధ్దు దేశాల కంటే ఎక్కువగానే ఉంది. దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు 1.2కి పడిపోయింది. దక్షిణ కొరియా శిశువైద్యుల కొరతను కూడా ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటును పెంచడానికి ఒక నగరం మ్యాచ్‌మేకింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.

ఉత్తర కొరియాలో దాదాపు 25 మిలియన్ల జనాభా ఉంది. 1990లలో కరువు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. ఉత్తర కొరియాలో కరోనా తరువాత ఇది మరింత ఎక్కువైంది. కరోనా తరువాత తన సరిహద్దులను కిమ్ మూసివేశారు. ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు లేకుండా చేసేశారు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు కుంటుబడిపోయారు. దీంతో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. దీంతో ప్రజలు పస్తులు ఉండాల్సిన దుస్థితి కూడా నెలకొంది. పేదరికంలో మగ్గుతున్నట్లు గతంలో పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read: రత్నాల గనిలో మహిళలకు మాత్రమే ఉద్యోగం.. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు ప్రశంసించేంతగా అక్కడేం జరుగుతుందో తెలుసా..?

ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేశాధ్యక్షుడు ఎక్కువమంది పిల్లల్ని కనాలని సూచించటం గమనించాల్సిన విషయం. పైగా కఠిన ఆదేశాలు జారీ చేయటం తప్ప సూచనలు చేయని కిమ్ తల్లులను ఉద్ధేశించి పిల్లల్ని కనాలని కోరటం ఆసక్తికరంగా మారింది.ఈ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకోవటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Also Read: చెంపలు వాయించే రెస్టారెంట్.. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న కస్టమర్లు

కాగా..కిమ్‌ పాలనలో కఠిన శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది యావత్ ప్రపంచానికి తేటతెల్లమైన విషయమే. అతి చిన్న కారణాలకు కూడా మరణశిక్షలు విధించటం ఆ దేశంలో సర్వసాధారణ విషయంగా ఉంటుంది. దక్షిణ కొరియాకు చెందిన వెబ్ సిరీస్ లు చూసినందుకు ఓ వ్యక్తిని బహిరంగంగా చంపేశారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉంటాయి ఉత్తరకొరియాలో కిమ్ నియంత పాలనలో.. అటువంటి కిమ్ కన్నీరు పెట్టుకోవటం అనే అంశం ఏమాత్రం చిన్నవిషయం కాదనేలా ఉంది.