పండగ చేస్కోండి : దీపావళి గిఫ్ట్.. ఉద్యోగుల జీతాలు డబుల్!
అసలే పండగ సీజన్. చేతులు డబ్బులు లేవు. ఒక నెల జీతం ఏం సరిపోతుంది అనుకునే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

అసలే పండగ సీజన్. చేతులు డబ్బులు లేవు. ఒక నెల జీతం ఏం సరిపోతుంది అనుకునే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
అసలే పండగ సీజన్. చేతుల్లో డబ్బులు లేవు. ఒక నెల జీతం ఏం సరిపోతుంది.. ఏం చేయాలి.. ఎలా పండగ పూట గడపాలి బాబోయ్.. అనుకునే ఉద్యోగులకు బంపర్ ఆఫర్. బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ముందుగానే దీపావళి పండుగ వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా అడ్వాన్స్ గా ఒక నెలం జీతాన్ని బ్యాంకు ఉద్యోగుల అకౌంట్లలో పడనున్నాయి. ఫెస్టివల్ గిఫ్ట్ రూపంలో 14 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ఒకే నెలలో రెండు జీతాలు అందుకోనున్నారు.
అందిన రిపోర్టు ప్రకారం.. అన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు తమ ఉద్యోగులకు ఒక నెల అడ్వాన్స్ జీతాన్ని దీపావళి గిఫ్ట్ గా తప్పనిసరిగా ఇవ్వాలని భారతీయ బ్యాంకు అసోసియేషన్ (IBA) సూచించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఒక లెటర్ పంపింది. దీంతో బ్యాంకు రంగాల్లో పనిచేసే 14 లక్షల మంది ఉద్యోగులకు జీతం రెట్టింపు కానుంది.
అంటే.. ఒకే నెలలో రెండు జీతాలు అందుకోనున్నారు. రిపోర్టు ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులకు ముందస్తు జీతం ఇవ్వాలనే నిర్ణయంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ఫెస్టివల్ అడ్వాన్స్ లో బేసిక్ శాలరీ + డియర్ నెస్ అలోయన్స్ (DA)లతో కలిపి ఇవ్వాలని IBA లేఖలో సూచించింది.
నవంబర్ 1, 2017 నాటికి బ్యాంకుల్లో ఉద్యోగులుగా ఉండి.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికి దీపావళికి ముందుగానే అడ్వాన్స్ శాలరీ ఇవ్వాలని ఐబీఏ లేఖలో స్పష్టం చేసింది. అలాగే.. బ్యాంకుల్లో నవంబర్ 1, 2017 నుంచి మార్చి 31, 2019 మధ్య కాలంలో విధుల్లో చేరిన వారు ఫెస్టివల్ అడ్వాన్స్ కింద సగం జీతం (హాఫ్ శాలరీ) మాత్రమే అందుకుంటారు.