Elon Musk : ఆ బాధ్యతలకు ఇక సెలవు.. ఎలన్ మస్క్ షాకింగ్ ట్వీట్..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. బిలియనీర్.. ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. మస్క్ తన ప్రతి అడుగులో ఓ కొత్తదనం కనిపిస్తుంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా సాహసోపేతంగా ఉంటాయి.

Thinking Of Quitting My Jobs Elon Musk Posts On Twitter, Gets A Coaching Offer
Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. బిలియనీర్.. ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. మస్క్ తన ప్రతి అడుగులో ఓ కొత్తదనం కనిపిస్తుంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా సాహసోపేతంగా ఉంటాయి. ఎప్పుడూ తన క్రేజీ ఐడియాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే ఈ టెక్ మేధావికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకవైపు టెస్లా కంపెనీ సీఈఓగా కొనసాగుతూనే.. మరోవైపు స్పేస్ ఎక్స్ అధినేతగా కొనసాగుతున్నారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. మళ్లీ ఏ కొత్త అవతారం ఎత్తబోతున్నాడో అంటూ ట్విట్టర్లో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో మస్క్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
I’ll be your first subscriber if you make an onlyfans
— Albi (SideArms) (@Albi_SideArms) December 10, 2021
ఇంతకీ మస్క్ చేసిన ట్వీట్ పరమార్థం ఏంటంటే?.. తాను సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారట.. అంతేకాదు… అన్నీ వదిలేసి ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతానని ట్వీట్ చేశాడు. అంతటితో ఆగలేదు. తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పడంటూ తన ఫాలోవర్లను అడిగేశాడు. ఎలన్ మస్క్.. ఏది అంత తేలికగా నిర్ణయం తీసుకోరు. ఒకవేళ అనుకున్నారంటే.. అది కచ్చితంగా అమలు చేసి తీరుతారని ఆయనను ఫాలో అయ్యేవారి వాదన.. నిజంగా బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? జోక్ చేశాడా? అంటే ఆయన ట్వీట్ల వెనుక వాస్తవం ఏదో ఉండే ఉండొచ్చునని ఆయన ఫాలోవర్లు అభిప్రాయపడుతున్నారు.
I’ll coach u on how to get YouTube views!
— MrBeast (@MrBeast) December 10, 2021
గతంలోనూ ఇలానే టెస్లాలోని తన 10 శాతం వాటాను అమ్మేద్దామనుకుంటున్నానని ఫాలోవర్స్ అభిప్రాయం కోరాడు మస్క్.. అప్పుడు అంతా నవ్వుకున్నారు కూడా. కానీ, టెస్లా బోర్డు సభ్యులతో పాటు అందరు షాక్ అయ్యేలా తన వాటాను అమ్మేశాడు. ఇప్పటికే 12 బిలియన్ డాలర్ల షేర్లను అమ్మేశాడు. ఇప్పుడు మళ్లీ మస్క్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మస్క్ ట్వీట్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనా పడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో మస్క్.. తాను మరికొన్నేళ్లు టెస్లా సీఈఓగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.
if you had a dollar for every shitpost you’d be a… oh wait, nvm
— Sami سامي (@samifouad) December 10, 2021
అయితే ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతానని మస్క్ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ల వరద వెల్లువెత్తుతోంది. మస్క్ చేసిన ట్వీట్లకు సరదాగా ఫాలోవర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అయితే మీకు కోచింగ్ ఆఫర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్‌పై స్పందించినవారిలో అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కూడా ఉన్నాడు. యూట్యూబ్‌లో వ్యూస్ ఎలా పొందాలో టెస్లా CEOకి తాను కోచింగ్ ఇస్తానని చెప్పాడు. YouTube వ్యూస్ ఎలా పొందాలో నేను మీకు శిక్షణ ఇస్తాను.. అంటూ బీస్ట్ ట్వీట్ చేశాడు.
Read Also : Google : గేమింగ్ లవర్స్‌కు గూగుల్ గుడ్ న్యూస్