దసరా పండగకు దిగొచ్చిన బంగారం ధర

కొద్ది రోజులుగా ఎగబాకిన బంగారం ధర దసరా కోసం దిగొచ్చింది. రెండ్రోజులుగా మరింత క్రమంగా తగ్గుతున్న బంగారం.. శనివారానికి ఒక గ్రాము రూ.3వేల586గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.37వేల 640కు చేరింది. ఓ వైపు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పైకి ఎగబాకుతోంది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.25 పెరిగి రూ.50,075కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో మాత్రమే కాదు. విజయవాడ, వైజాగ్‌లలోనూ వెండి ధర ఎక్కువగానే ఉంది.
గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం విలువ పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.78 శాతం తగ్గడంతో 1,503.45 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గడం చాలా అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యూవెలరీ మార్కెట్వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
ఇంట్రా డే సేల్స్‌లో కొనుగోలు చేసే యూజర్లకు బంగారం ధర క్రమంగా తగ్గుతుండటం షాక్ ఇస్తుంది. చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం. గోల్డ్ జ్యూవెలరీ, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ తీసుకోవడం ఉత్తమం.