Smartphone Price Hike : స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి షాక్.. ఇకపై మొబైల్ కొనడం కష్టమే.. భారీగా పడిపోనున్న అమ్మకాలు.. కారణమిదే..
Smartphone Price Hike : స్మార్ట్ ఫోన్ లవర్స్ కి భారీ షాక్.. ధరలు పెరుగుతున్నందున పండగ సీజన్ లో అమ్మకాలు పడిపోతాయని అంటున్నారు.
trackin tech report reveals mobile phones price hike festival sales drop in india
Smartphone Price Hike : స్మార్ట్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేము. అది మన శరీరంలో ఒక భాగం అయ్యింది. రాత్రి మొబైల్ చూస్తూనే పడుకుంటాం.. పొద్దున లేవగానే ఫోన్ చూస్తాం. కాసేపు మొబైల్ చూస్తే తప్ప రోజు ప్రారంభం కాదు. కోవిడ్ తర్వాత పిల్లల చేతికి కూడా ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఇక ప్రతి ఏటా మొబైల్ ఫోన్లు కొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ధరలు పెరిగినా సరే మొబైల్ లవర్స్ మాత్రం కొత్త ఫోన్లు కొనడం మానడం లేదు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి ఇది భారీ షాకింగ్ వార్త అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతూ పోతుండటం వల్ల ఈసారి పండుగ సీజన్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు విపరీతంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ట్రేడిన్ టెక్, బెంచ్‌మార్క్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారిలో 54 శాతం మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవచ్చు లేదా పాత ఫోన్ల వైపే మొగ్గు చూపవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 30 శాతం వరకు తగ్గొచ్చు అని చెబుతున్నారు.
గత సంవత్సరం 13.8 కోట్ల యూనిట్లుగా ఉన్న స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈసారి 12 కోట్ల యూనిట్లకు పడిపోవచ్చని చెబుతున్నారు. మెమొరీ చిప్ ధరలు పెరగడం వల్ల గతేడాది జనవరి నుంచే స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రూ. 20 వేలలోపు బడ్జెట్ ఫోన్ల ధరలు 12 శాతం దాకా పెరిగాయి. రూపాయి విలువ తగ్గడం, కంపెనీలు అమ్మకపు ధరలను పెంచడం ఇందుకు ప్రధాన కారణాలు అంటున్నారు.
