Truecaller Web : ట్రూకాలర్ వెబ్‌ వెర్షన్ వచ్చేసిందోచ్.. మీ కంప్యూటర్ స్ర్కీన్ పైనే నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందొచ్చు!

Truecaller Web : ట్రూకాలర్ యాప్‌లోని మెసేజ్ ట్యాబ్‌పై ట్యాప్ చేయడం ద్వారా వెబ్ ట్రూకాలర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రూకాలర్ వెబ్ మెసేజ్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయొచ్చు.

Truecaller Web : ట్రూకాలర్ వెబ్‌ వెర్షన్ వచ్చేసిందోచ్.. మీ కంప్యూటర్ స్ర్కీన్ పైనే నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందొచ్చు!

Truecaller now available on web: Check out the features

Truecaller Web : మీరు ట్రూకాలర్ వాడుతున్నారా? ఇప్పటివరకూ మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్రూకాలర్ సర్వీసు ఇప్పుడు వెబ్ వెర్షన్ కూడా ప్రవేశపెట్టింది. ఈ ట్రూకాలర్ వెబ్ వెర్షన్ ద్వారా స్పామ్ కాల్‌లను అరికట్టేందుకు గుర్తుతెలియని నంబర్‌ని వినియోగదారులు చెక్ చేయొచ్చు. టెక్స్ట్ మెసేజ్‌లను చూడవచ్చు. ఆయా వాటికి రిప్లయ్ ఇవ్వొచ్చు. అంతేకాదు.. కంప్యూటర్ నుంచి నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

Read Also : Truecaller: మోసాల నివారణకు ట్రూకాలర్ ఏఐ రికగ్నైజేషన్ ఫీచర్.. ఓసారి కన్నేయండి

మీ కంప్యూటర్ నుంచి నేరుగా అన్ని టెక్స్ట్ మెసేజ్‌లు, చాట్‌లను చదవవచ్చు. వాటికి రిప్లయ్ ఇవ్వొచ్చు. డివైజ్‌ల మధ్య నిరంతరం మారవలసిన అవసరం లేదు. ట్రూకాలర్ వెబ్ యూజర్లు ఎస్ఎంఎస్ ఇన్‌బాక్స్, ట్రూకాలర్ చాట్ మెసేజ్‌లు, బిజినెస్ సంబంధిత మెసేజ్‌లను కూడా వీక్షించవచ్చు. ట్రూకాలర్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో అన్నీ సులభంగా చదువుకోవచ్చు.

  • మీ కంప్యూటర్ కీబోర్డ్‌ ఆప్షన్‌తో మెసేజ్‌లను టైప్ చేయొచ్చు.
  • 100ఎంబీ వరకు మల్టీ ఫైల్‌లను యాడ్ చేయొచ్చు.
  • ట్రూకాలర్ అత్యవసర మెసేజ్ ఫీచర్‌ ఉపయోగించి సందేశాలను ఎమర్జెన్సీ అని మార్క్ చేయొచ్చు.
  • తద్వారా ముఖ్యమైన మెసేజ్‌లను వెంటనే చూడవచ్చు.
  • ఇన్‌కమింగ్ కాల్, మెసేజ్ అలర్ట్‌లను రియల్ టైమ్‌లో నేరుగా మీ కంప్యూటర్ స్క్రీన్‌పై ఆపరేట్ చేయొచ్చు.
  • ఈ ఫీచర్ మీ కంప్యూటర్‌లో ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా కనెక్ట్ అయి సమాచారం అందేలా చేస్తుంది.
  • ట్రూకాలర్ వెబ్ ఫీచర్ ద్వారా మీ ఫోన్, వెబ్ బ్రౌజర్ మధ్య ఎన్‌క్రిప్టెడ్ లింక్‌ను పొందవచ్చు.
  • ఈ సెటప్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. యూజర్లు తమ డివైజ్‌లను వెంటనే లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.
  • ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌, మెసేజ్‌లకు యాక్సెస్ లేకుండా ప్రైవసీ, సెక్యూరిటీని అందించడంలో ట్రూకాలర్ కట్టుబడి ఉందని యూజర్లకు హామీ ఇస్తుంది.

వెబ్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? :
ఆండ్రాయిడ్ యూజర్లు ట్రూకాలర్ యాప్‌లోని మెసేజ్ ట్యాబ్‌పై ట్యాప్ చేయడం ద్వారా వెబ్ ట్రూకాలర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రూకాలర్ వెబ్ మెసేజ్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయొచ్చు. లేదంటే.. యూజర్లు (web.truecaller.com)ని విజిట్ చేయొచ్చు. ఈ లింక్ ద్వారా డివైజ్‌లను ఈజీగా లింక్ చేయవచ్చు.

ట్రూకాలర్ వెబ్ ద్వారా మెసేజ్‌లకు సులభమైన యాక్సెస్, రియల్ టైమ్ నోటిఫికేషన్‌లు, మెరుగైన మెసేజ్ ఫీచర్లను అందిస్తుంది. సురక్షితమైన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వెబ్ ట్రూకాలర్ యూజర్లందరికి కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్ పరంగా సెక్యూరిటీని అందిస్తుంది.

Read Also : iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్.. ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావొచ్చు!