ఓలా, అథర్, చేతక్‌కు గట్టిపోటీనిచ్చేందుకు TVS iQube 3.1 వచ్చేసింది.. ఈ స్కూటర్‌నే ఎందుకు కొనాలంటే?
బజాజ్ తాజాగా చేతక్ 3001 ని లాంచ్ చేయగా, టీవీఎస్ ఇప్పుడు iQube 3.1ను లాంచ్ చేసింది.

TVS iQube 3.1
భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కోల్పోయిన తర్వాత, TVS iQube, బజాజ్ చేతక్ లైనప్ ఈ విభాగంలో ముందుకు దూసుకొస్తున్నాయి. TVS iQube, బజాజ్ చేతక్ బ్రాండ్లు అమ్మకాలు, వాల్యూమ్స్ పరంగా ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ 3001 ని లాంచ్ చేయగా, టీవీఎస్ ఇవాళ iQube 3.1ను లాంచ్ చేసింది.
TVS iQube 3.1 లాంచ్
కొత్తగా లాంచ్ అయిన TVS iQube 3.1 స్కూటర్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న iQube 2.2, iQube 3.5 వాటికి మిడిల్ రేంజ్ మోడల్. ఇది 3.1 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది iQube, iQube S, iQube ST లైనప్‌లలో 3.1 kWh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి మోడల్.
- TVS iQube 3.1 ధర: రూ. 1.1 లక్షలు (ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్, బెంగళూరు)
- iQube 2.2 ధర: రూ. 1.01 లక్షలు
- iQube 3.5 ధర: రూ. 1.23 లక్షలు
Also Read: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
కలర్ ఆప్షన్స్
కొత్త iQube 3.1 మొత్తం 5 రంగుల ఆప్షన్లతో లభ్యమవుతోంది..
- మోనోటోన్ రంగులు: గ్రే, కాపర్, వైట్
- డ్యుయల్ టోన్ రంగులు: బ్లూ/బెజ్, బ్రౌన్/బెజ్
స్పెసిఫికేషన్స్
3.1 kWh బ్యాటరీ: IDC సర్టిఫైడ్ 121 కి.మీ రేంజ్
ఛార్జింగ్ సమయం: 0% నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి 4 గంటల 30 నిమిషాలు (iQube 3.5 కన్నా బ్యాటరీ చిన్నదైనా, ఛార్జింగ్ టైం ఒకేలా ఉంది)
మోటార్: హబ్-మౌంటెడ్ మోటార్, టాప్ స్పీడ్ 82 కిమీ/గం
బరువు: 116.8 కిలోలు – iQube 2.2 కంటే కాస్త ఎక్కువ
ఇంకేమున్నాయి?
- డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్
- TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- పిలియన్ బ్యాక్రెస్ట్
- LED లైటింగ్ (సంపూర్ణంగా)
- 31 లీటర్ల పెద్ద అండర్‌సీట్ స్టోరేజ్
- ప్రాక్టికల్ ఫ్లోర్‌బోర్డ్