సముద్రంలో ప్రయాణం: ఉబర్ ‘బోట్’ వచ్చేసింది
ప్రముఖ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఉబర్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే క్యాబ్, బైక్, ఎయిర్ సర్వీసులు అందిస్తోన్న ఉబర్.. సముద్రంలో కూడా సర్వీసులను అందించనుంది.

ప్రముఖ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఉబర్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే క్యాబ్, బైక్, ఎయిర్ సర్వీసులు అందిస్తోన్న ఉబర్.. సముద్రంలో కూడా సర్వీసులను అందించనుంది.
ప్రముఖ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఉబర్ తమ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే క్యాబ్, బైక్, ఎయిర్ సర్వీసులు అందిస్తోన్న ఉబర్.. సముద్రంలో కూడా సర్వీసులను అందించనుంది. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్ కో ఆధారిత రైడ్ యూనికార్న్ సంస్థ ముంబైలో బుధవారం (జనవరి 30, 2019) ఉబర్ బోట్ (UberBOAT) సర్వీసులను ప్రారంభించింది. ముంబై పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ సంజయ్ భాటియా ఈ సర్వీసును ప్రారంభించారు. మహారాష్ట్ర మెరిటైమ్ బోర్డు భాగస్వామ్యంతో ఈ బోట్ సర్వీసులను ఉబర్ అందించనుంది. ఉబర్ అందించే స్పీడ్ బోట్ సర్వీసులతో.. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి రాకపోకలు సాగించే ముంబై నగర వాసులకు ప్రయాణం సులభం కానుంది. ఈ స్పీడ్ బోట్ లో ఆరు నుంచి పది సీట్లు ఉంటాయని ఉబర్ వర్గాల సమాచారం. ఈ ఫీచర్ సాయంతో రైడర్స్ సింగిల్ సీటు, లేదా స్పీడ్ బోట్ మొత్తాన్ని బుక్ చేసుకొనే అవకాశం ఉంది.
15 నిమిషాలు ప్రయాణించాల్సిందే
అయితే ఈ బోటులో తప్పనిసరిగా 15 నిమిషాల ప్రయాణించాల్సిందేనట. గేట్ వే-మండ్వా జెట్టీ మీదుగా వెళ్లే సముద్ర మార్గంలో ఉబర్ స్పీడ్ బోట్ సర్వీసులను అందించనున్నట్టు నివేదిక తెలిపింది. ఈ ఉబర్ డైనమిక్ సర్వీసుకు త్వరలోనే కచ్చితమైన ధరను కూడా ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది. UberBOAT స్పీడ్ బోట్ మాండ్వా నుంచి అలీబాగ్ లేదా కిహిం బీచ్ లకు వెళ్లేందుకు గంట సమయం పట్టనుండగా.. 20 నుంచి 22 నిమిషాల్లో రెండెంటి మధ్య దూరాన్ని ఉబర్ బోట్ కవర్ చేస్తుందని ఉబర్ యాజమాన్యం అంచనా వేస్తోంది.
ముంబైకి గేమ్ ఛేంజర్..
ముంబై వాసులకు ఈ ఉబర్ బోట్ సర్వీసు గేమ్ ఛేంజర్ గా పనిచేస్తుందని ఉబర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. UberBOAT సర్వీసు విజయవంతమైతే.. నేవీ ముంబై సహా ఇతర మార్గాల్లో కూడా భవిష్యత్తులో విస్తరించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. నేవీ ముంబై సమీ ప్రాంతాలైన నీరూల్, బెలాపూర్ నుంచి దక్షిణ ముంబైకి ప్రత్యేక సర్వీసులను నడపాలని భావిస్తున్నారు. అదేగాని జరిగితే.. రెండు నగరాల మధ్య రోజువారీ పనులకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.
త్వరలో ‘ఉబర్ ఫ్లీట్’ యాప్
వాటర్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీసుతో పాటు ముంబైలో ఉబర్ ఫ్లీట్ యాప్ సర్వీసును కూడా త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే కొన్ని నెలల నుంచి ఢిల్లీ సహా వివిధ నగరాల్లో ఈ సర్వీసును ఉబర్ అందిస్తోంది. ఇకపై ఈ సర్వీసును దేశవ్యాప్తంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో లైవ్ మ్యాప్ ఫీచర్ ద్వారా.. రియల్ టైమ్ వెహికల్స్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేసేందుకు వీలుంటుందని ఉబర్ హెడ్ ఆఫ్ డ్రైవర్ ప్రొడక్ట్ డేనియల్ డ్యాంకర్ తెలిపారు.