Vivek Oberoi : సినీనటుడు వివేక్ ఒబెరాయ్ రూ.3,400 కోట్లకు యజమాని ఎలా అయ్యాడు! ఆయన మాటల్లోనే..!

Vivek Oberoi : నటుడు-వ్యవస్థాపకుడు వివేక్ ఒబెరాయ్ మనీ లెండింగ్ బిజినెస్ రూ. 3,400 కోట్లకు చేరుకుంది. తాను స్టార్టప్‌ను ఎలా ప్రారంభించారు? అదేలా సక్సెస్ అయిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Vivek Oberoi : సినీనటుడు వివేక్ ఒబెరాయ్ రూ.3,400 కోట్లకు యజమాని ఎలా అయ్యాడు! ఆయన మాటల్లోనే..!

Vivek Oberoi reveals his money

Updated On : December 14, 2024 / 11:18 PM IST

Vivek Oberoi : ప్రముఖ నటుడు-వ్యవస్థాపకుడు వివేక్ ఒబెరాయ్ వేల కోట్లకు యజమాని అని తెలుసా? సినిమాల నుంచి కాకుండా వ్యాపారం నుంచే ఒబెరాయ్ ఎక్కువ ఆదాయం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, తనకు వాటాలు ఉన్న అనేక కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు తన బ్రాండ్‌ను ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి ఇటీవలే ఒబెరాయ్ ప్రస్తావించారు.

విద్యార్థుల చదువు కోసం సున్నా-వడ్డీ చెల్లింపుతో డబ్బులను అప్పుగా ఇచ్చే బిజినెస్ (మనీ లెండింగ్ కంపెనీ) ప్రారంభించినట్టు చెప్పారు. అయితే, ఈ వ్యాపారంతో భారీ లాభాలను ఆర్జించిందని, ప్రస్తుతం కంపెనీ విలువ దాదాపు రూ.3,400 కోట్లకు చేరిందని వివేక్ తెలిపారు.

ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ మాట్లాడుతూ.. ‘నేను ఎడ్యుకేషన్ లోన్‌ల ఆధారంగా స్టార్టప్‌ను ప్రారంభించాను. కొద్దికాలంలోనే చాలా పెద్దదిగా మారింది. మేము బీ2బీ నెట్‌వర్క్ ద్వారా 12వేల స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలను చేరుకుంటాం. కానీ, మేము కస్టమర్‌తో కనెక్ట్ అయ్యాం.

వారి మొత్తం డేటాను మా వద్ద ఉంచుకున్నాం. మా కస్టమర్ బేస్ గురించి నేరుగా తెలుసుకున్నాం. స్కూల్ లేదా కాలేజీలకు వెళ్ళిన 45 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మా కంపెనీ విలువ దాదాపు రూ. 400 మిలియన్లు (సుమారు రూ. 3,400 కోట్లు)కు చేరింది.

వివేక్ ఒబెరాయ్ కోట్ల వ్యాపారం :
‘నేను నా బ్రాండ్‌ను వాడితే అది నాకు గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే.. సమాజానికి సానుకూల ప్రభావాన్ని సృష్టించే పనులను నేను ఇష్టపడతాను. మేము సృష్టించిన వాటిలో ఒకటి డబ్బు ఇచ్చే వ్యాపారం. లోన్ కంపెనీ కోసం మనీ-లెండింగ్ వ్యాపార ప్రణాళికను రూపొందించడం అనేది ఒక పెద్ద విషయం. కానీ అది చాలా బాగా పనిచేసి కంపెనీని చాలా సక్సెస్ చేశాం’ అని తెలిపారు.

ఎకానమీలోనే వివేక్ ప్రయాణం  :
ఈ సదస్సుకు తన బృందాన్ని పంపి ఉంటే ఆ సంస్థకు వచ్చినంత గౌరవం, శ్రద్ధ లభించేవని వివేక్ అన్నారు. ‘నేను ఎక్కడికైనా వెళ్లినా ఒక స్టార్టప్ యజమానిని. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్‌కి వెళ్తాను. కానీ, నేను నా సొంత కంపెనీకి వెళ్లినప్పుడు నేను మొత్తం టీమ్‌తో ఎకానమీలోనే వెళ్తాను’ అని పేర్కొన్నారు.

ఆత్మను అమ్ముకుని పని చేయలేదు :
ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టడంపై అనేక విషయాలను ప్రస్తావించారు. ‘వ్యాపారం ఎప్పుడూ ప్లాన్-బిగా ఉండేది. సినిమానే నా ప్యాషన్ అని నిర్ణయించుకున్నాను. నా జీవనాధారం.. నా వ్యాపారం కావాలి.. అది నాకు ఖర్చులకు సాయపడుతుంది. నేను పనికి నా ఆత్మను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇది జీవించడానికి సరైన మార్గం కాదు. కొంతమంది దీంతో జీవనోపాధి పొందుతుంటారు కానీ నాకు అలా కాదు.’ అని పేర్కొన్నారు.

Read Also : ITR Advance Tax Deadline : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ నెల 15 వరకు డెడ్‌లైన్.. ఇప్పుడే పన్ను చెల్లించండి..!