Vodafone Idea 5G Launch : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా త్వరలో వోడాఫోన్ ఐడియా 5జీ వస్తోంది.. ముందుగా ఆ రెండు మెట్రా నగరాల్లోనే..!
Vodafone Idea 5G Launch : జియో, ఎయిర్టెల్ కంపెనీలకు పోటీగా వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను తీసుకొస్తోంది. మెట్రో సిటీలతో పాటు ప్రధాన పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి 17 ప్రాంతాలలో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.

Vodafone Idea to launch 5G ( Image Source : Google )
Vodafone Idea 5G Launch : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా 5జీ లాంచ్ కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కంపెనీ మార్చి 2025 నాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో మొట్టమొదటగా 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇతర టెలికం పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలకు పోటీగా వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను తీసుకొస్తోంది. మెట్రో సిటీలతో పాటు ప్రధాన పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి 17 ప్రాంతాలలో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ పేర్కొన్నారు.
వోడాఫోన్ ఐడియా 4జీ కవరేజీని జూన్ 2024 నాటికి భారత జనాభాలో 90 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం విఐ 4జీ నెట్వర్క్ జనాభాలో 77 శాతం మందిని కవర్ చేస్తుంది. సుమారు 1.03 బిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లకు మెరుగైన పోటీనిచ్చేలా కంపెనీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది.
విఐ ప్రణాళికలో భాగంగా, ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ నుంచి రూ18వేల కోట్లతో సహా ఈక్విటీ ఫండింగ్ ద్వారా రూ. 24వేల కోట్లను సేకరించింది. ఈ డబ్బులో ఎక్కువ భాగం 4జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, 5జీ ప్రారంభానికి సపోర్టు అందించనుంది. ఒకసారి నెట్వర్క్ అప్గ్రేడ్లు పూర్తయితే.. కొన్ని నెలల్లో వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్లను మరింత పెంచుకోవచ్చునని భావిస్తోంది.
వోడాఫోన్ ఐడియా (Vi) సర్వీసు క్వాలిటీని మెరుగుపరిచేందుకు 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. కంపెనీ 900MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz వంటి బ్యాండ్లతో సహా అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్‌లను ప్రభావితం చేస్తోంది. కంపెనీ ప్రత్యేకంగా 900MHz బ్యాండ్‌పై దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ఇంటి లోపల మెరుగైన కవరేజీని అందిస్తుంది. ఈ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి సెల్ టవర్లు (సైట్లు) సంఖ్యను గణనీయంగా పెంచనుంది. 55వేల నుంచి లక్ష 50వేల వరకు పెంచనుంది. ఇప్పటివరకు, ఈ కొత్త సైట్లలో 50వేల టవర్లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 50వేలు వచ్చే 9 నెలల్లో పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.
వోడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్, ఏటీసీ టవర్ విజన్ వంటి ప్రధాన టవర్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రాజెక్ట్ అమలులో ఎలాంటి జాప్యాలు లేవు. నవంబర్ నుంచి అదనపు టవర్లను ఉపయోగించడం ప్రారంభించాలని విఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ, ఇండస్ టవర్స్ వంటి టవర్ కంపెనీలకు బకాయి ఉన్న చెల్లింపులను క్లియర్ చేసిందా లేదా అనే దానిపై విఐ రివీల్ చేయలేదు. విఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసేందుకు చైనీస్ డీలర్లతో నెట్వర్క్ డీల్స్ పునరుద్ధరించదని నివేదిక సూచిస్తుంది. కంపెనీ చైనీస్ డివైజ్‌లను రిప్లేస్ చేసేందుకు ప్రతిపాదనల (RFP) కోసం సిద్ధం అవుతోంది. అయితే, రాబోయే రెండేళ్లలో ప్రతిదీ కాలక్రమేణా తొలగించాలని యోచిస్తోంది.
వోడాఫోన్ ఐడియా 5జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసే క్రమంలో విఐ వర్చువలైజ్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (vRAN)ని అన్వేషిస్తోంది. కర్ణాటక, బీహార్, పంజాబ్ ప్రాంతాలలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. అయినప్పటికీ, ఓపెన్ఆర్ఏఎన్ (ఒక రకమైన నెట్వర్క్ టెక్నాలజీ)తో ప్రయోగాలు ఆశాజనకంగా లేవు. యూఎస్-ఆధారిత మావెనిర్తో భాగస్వామ్యంలో జలంధర్‌లోని 25 సైట్లలో ఓపెన్ఆర్ఏఎన్ రన్ చేసినప్పటికీ, అధిక ఖర్చులు, సాంకేతిక సమస్యలతో ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి.
Read Also : Vivo Y19s Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త Y19s ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!