Gold: బంగారాన్ని విపరీతంగా ఎవరు కొంటారో.. ఎందుకు కొంటారో తెలుసా? మీరు కొంటున్నారా?

ఎందుకిలా చేస్తారో తెలుసా?

Gold: బంగారాన్ని విపరీతంగా ఎవరు కొంటారో.. ఎందుకు కొంటారో తెలుసా? మీరు కొంటున్నారా?

Gold

Updated On : March 8, 2025 / 7:52 PM IST

ఆర్థిక అనిశ్చితి లేదా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితులలో బంగారం దేశాన్ని కాపాడుతుందని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వచేస్తూ అతిపెద్ద బంగారం నిల్వదారులుగా మారాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను, అలాగే కరెన్సీ బలాన్ని మెరుగుపరుస్తుంది. అంతేగాక దివాళా తీసే దుస్థితిని దగ్గరకు కూడా రానివ్వకుండా కాపాడుతుంది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన డేటా ప్రకారం 2022లో ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు సుమారు 70 బిలియన్ డాలర్ల విలువైన 1,136 టన్నుల బంగారాన్నికొనుగోలు చేశాయి. చైనా, భారత్, టర్కీ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను వేగంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్ ఉద్రిక్తతల నుంచి కాపాడుతాయని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను పెంచుకున్నాయి.

బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే వారు ఎవరెవరంటే?

కేంద్ర బ్యాంకులు – తమ దేశ కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. చైనా, భారతదేశం, రష్యా, అలాగే టర్కీ వంటి దేశాలు ఇటీవలి కాలంలో భారీగా బంగారం నిల్వలు పెంచుకున్నాయి.

పెట్టుబడిదారులు – బంగారం ఒక సురక్షిత ఆస్తిగా భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, లేదా మార్కెట్ మాంద్యం సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతుంది.

ఆభరణాల వ్యాపారులు, వినియోగదారులు – భారతదేశం, చైనా వంటి దేశాల్లో బంగారాన్ని ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. వివాహాలు, పండుగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేవారు అధికంగా ఉంటారు.

కొందరు పెద్ద స్థాయి పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు తమ సంపదను విభజించేందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. మొత్తంగా, ఆర్థిక స్థితిగతులను బట్టి బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య మారవచ్చు. కానీ కేంద్ర బ్యాంకులు అలాగే పెట్టుబడిదారులు బంగారం ప్రధాన కొనుగోలుదారులుగా ఉంటారు.