Gold Rate : బాబోయ్ బంగారం.. భారీగా పెరుగుతున్న ధరలు, ఎందుకిలా?

బంగారం ధర పెరగనుందనే వార్తలతో వెంటనే గోల్డ్ కొనుగోలు కోసం డబ్బు చెల్లించి అక్షయ తృతీయ రోజు పసిడిని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

Gold Rate : బాబోయ్ బంగారం.. భారీగా పెరుగుతున్న ధరలు, ఎందుకిలా?

Gold Price Surges

Gold Rate : పసిడి ధరలు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం బంగారంపై 200 రూపాయలకు పైనే పెరగ్గా.. కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74వేల 210 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 84వేల 200 రూపాయలుగా ఉంది.

Gold

Gold

ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 64వేల 600 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70వేల 470 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 64వేల 600 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70వేల 470 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర 65వేల 450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71వేల 400 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 64వేల 750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర 70వేల 620 రూపాయలుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.

Gold

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిటైల్ మార్కెట్ లో గోల్డ్ కు ఫుల్ డిమాండ్ ఉంది. మరో వారం రోజుల్లో ఉగాది, గుడిపడ్వా, రంజాన్ పండుగలు ఉన్నాయి. దీంతో గోల్డ్ షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. దీనికి తోడు వచ్చే నెల 10న అక్షయ తృతీయ ఉండటంతో ముందస్తు బుక్కింగ్స్ కూడా జోరందుకున్నాయి. బంగారం ధర పెరగనుందనే వార్తలతో వెంటనే గోల్డ్ కొనుగోలు కోసం డబ్బు చెల్లించి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read : దేశంలో బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?