2020లోనూ భారీగా పెరగనున్న బంగారం ధరలు! 

  • Published By: sreehari ,Published On : January 1, 2020 / 02:35 PM IST
2020లోనూ భారీగా పెరగనున్న బంగారం ధరలు! 

Updated On : January 1, 2020 / 2:35 PM IST

కొత్త ఏడాది 2020లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిలో బంగారం ధరలు 25శాతం మేర పెరిగినప్పటికీ ఈ కొత్త ఏడాదిలోనూ అదే స్థాయిలో బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

గత ఏడాది 2019 సంవత్సరంలో బంగారం 6 సంవత్సరాల ట్రేడింగ్‌తో బలమైన లాభాలను నమోదు చేసింది. COMEX లో బంగారం ధరలు 18శాతం పెరగగా.. భారతదేశంలో MCXలో బంగారం 25శాతం మేర పెరిగింది. 2019లో బంగారం ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020లో కూడా అదే స్థాయిలో బంగారం ధరలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

13 శాతం పెరిగే అవకాశం :
ఫిబ్రవరిలో MCX గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం 10 గ్రాములకు రూ.39వేల 100 దగ్గర ముగిసింది. 2019 లాభాలతో ఇది సరిపోలనప్పటికీ 2020 సంవత్సరంలో 12 శాతం నుంచి 13 శాతం మేర లాభాలను గడించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేటు వాతావరణం బ్యాంకులను భద్రత, డాలర్ సూచికలో బలహీనత, పెరుగుతున్న ప్రపంచ రుణాల వైపు ఆకర్షించేలా ఉండటంతో కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేయడం కారకాలుగా ఉన్నాయని’ అని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్రరావు అన్నారు.

డాలర్ పరంగా చూస్తే.. బంగారం ఒక ఔన్సు 1650 డాలర్లు.. 2020లో ఒక ఔన్స్ 1700 డాలర్లుగా నమోదు అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. గ్లోబల్ రిస్క్ ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారని తాము నమ్ముతున్నామని అన్నారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం, కేంద్ర బ్యాంకుల నుంచి కొనుగోలు, బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరగడం వంటివి బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. భారతదేశంలో ప్రభుత్వం బంగారంపై విధించే దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ఇండియాలో బంగారం ధరలు 12.5శాతం ​​దిగుమతి సుంకంతో పాటు 3శాతం జీఎస్టీ కూడా ఉంది.

బంగారం ధరల పెరుగుదలతో దేశంలో బంగారు డిమాండ్‌ను ప్రభావితం చేసింది. ‘2019 లో బంగారం MCXలో 10 గ్రాములకు రూ.39వేల 885తో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకినప్పుడు భారత డిమాండ్ బాగా పడిపోయింది. దీంతో దేశీయ ధర అంతర్జాతీయ ధరల్లో బాగా తగ్గిపోయింది’ అని రావు అన్నారు.

2019 చివరి త్రైమాసికంలో ధరలు దిద్దుబాటుతో బంగారం డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోలుపై ఆసక్తి కూడా పెరిగింది. 2020లో కూడా అదే బంగారం ధర పునరావృతం అవుతుందని ఆశిస్తున్నట్టు రావ్ చెప్పారు.