SMS Notification Alert : మీ ఫోన్‌కు ఇలా ‘127000’ SMS నోటిఫికేషన్ వస్తుందా? వెంటనే ఈ పనిచేయండి.. ఇక మెసేజ్ కంట్రోల్ మీ చేతుల్లో..!
SMS Notification Alert : సైబర్ మోసాలతో జాగ్రత్త.. మొబైల్ యూజర్ల సేఫ్టీ కోసం ట్రాయ్, ఆర్బీఐతో కలిసి DCA పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
SMS Notification Alert
SMS Notification Alert : మొబైల్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఇటీవీల సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొత్త నెంబర్ నుంచి పదేపదే నోటిఫికేషన్లు వస్తాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భారతీయ టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లేదా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ ఉన్న మొబైల్ యూజర్లు ఉన్నారు.
మీకు నిజంగా 127000 నంబర్ నుంచి ప్రత్యేక టెక్స్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ SMS అనేది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో కలిసి డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్ (DCA) పైలట్ పేరుతో జాయింట్ ట్రయల్ ప్రాజెక్ట్‌లో భాగంగా తప్పనిసరి చేసింది. ప్రమోషనల్ మెసేజ్‌లు (బ్యాంక్ ప్రకటనలు వంటివి) మీ అన్ని అనుమతులను డిజిటల్ సిస్టమ్‌కు మూవ్ చేయడం ద్వారా ఆ మెసేజ్‌లను కంట్రోల్ చేయొచ్చు.
ఈ సమస్యకు పరిష్కరం ఇదే :
ప్రస్తుత రూల్స్ (2018 నిబంధనలు) ఇప్పటికే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయడం లేదా అనుమతించే ఆప్షన్ ఉంది. బిజినెస్ వంటి వ్యవహారాల కోసం మీ పర్మిషన్స్ డిజిటల్ కాన్సెంట్ రిజిస్ట్రీని ఉంచుకోవాలి. అయితే, చాలా మంది వినియోగదారులు పేపర్ ఫారమ్‌లపై ప్రమోషనల్ మెసేజ్‌లకు (మీ బ్యాంకు వంటివి) అనుమతి ఇచ్చారు.
మీరు మెసేజ్ తర్వాత ఆపాలనుకుంటే ఆ పేపర్ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. దీన్ని పరిష్కరించేందుకు ట్రాయ్ ఆర్బీఐ ఒక ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు ఈ పాత, పేపర్ ఆధారిత కస్టమర్ అనుమతులను ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తాయి. ఈ పోర్టల్ కస్టమర్‌లు ఇకపై మెసేజ్ చేరకపోతే ఆ అనుమతులను సులభంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
127000 నుంచి వచ్చే SMSలో ఏముంది? :
ఆ SMS రెండు విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి స్టాండర్డ్ అలర్ట్ మెసేజ్, మరొకటి సేఫ్ లింక్ అని ఉంది. ఈ లింక్ నేరుగా కాన్సెంట్ మేనేజ్ పేజీ అనే అధికారిక వెబ్‌పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
ఈ పేజీలో ఇవి చూడొచ్చు :
మీ బ్యాంక్ మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసిన పాత అనుమతులన్నింటినీ చూడొచ్చు.
ఆ అనుమతులలో ఏదైనా డిలీట్ చేయాలా? మార్చాలా లేదా స్టాప్ చేయాలా క్యాన్సిల్ చేయలా? అనేది నిర్ణయించుకోండి.
బ్యాంకులు అప్‌లోడ్ చేసిన అన్ని పాత సమ్మతులను పోర్టల్ డిస్‌ప్లే చేస్తుంది.
సేఫ్టీ కోసం తప్పక తెలుసుకోండి :
యాక్ట్ ఆప్షనల్ : మీరు వద్దని అనుకుంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
సేఫ్టీ ఫస్ట్ : ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ లేదా ఆర్థిక సమాచారం అడగరు. 127000 నంబర్ నుంచి వచ్చే SMSలపై మాత్రమే రిపోర్టు చేయండి.
నో SMS డోంట్ వర్రీ : మీకు ఈ SMS అందకపోతే.. ఆందోళన అవసరం లేదు. ప్రస్తుతం ఒక చిన్న ట్రయల్ ప్రాజెక్ట్ మాత్రమే, పూర్తి సిస్టమ్ తర్వాత అందుబాటులోకి వస్తుంది.
ట్రయల్‌లో ఎవరు పాల్గొంటున్నారు?
ఈ పైలట్ ప్రాజెక్టులో మొత్తం 9 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPలు), 11 బ్యాంకులు పాల్గొంటున్నాయి.
బ్యాంకులు : SBI, PNB, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉన్నాయి.
