Womens Day Gift Ideas : ఉమెన్స్ డే రోజున మీ భార్య పేరుతో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. జస్ట్ రెండేళ్లలో లక్షాధికారిని చేస్తుంది!

Womens Day Gift Ideas : ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ భార్యకు కొత్తగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి చూడండి. ఆమె పేరుతో ఏదైనా పథకంలో ఇన్వెస్ట్ చేయండి.. అది ఆమెను కేవలం రెండేళ్లలోనే లక్షాధికారిని చేసేస్తుంది.

Womens Day Gift Ideas : ఉమెన్స్ డే రోజున మీ భార్య పేరుతో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. జస్ట్ రెండేళ్లలో లక్షాధికారిని చేస్తుంది!

Womens Day Gift Ideas

Updated On : March 7, 2025 / 6:02 PM IST

Womens Day Gift Ideas : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ భార్యకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వవచ్చు. ఎప్పుడూ డబ్బులు, నగలు, బట్టలు, డిన్నర్‌కి తీసుకెళ్లడం కామన్. ఈసారి ఏదైనా కొత్తగా ప్లాన్ చేయండి.

మీ భార్య కోసం ఒక ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోండి. ఆమెను రెండేళ్లలో లక్షాధికారిని చేస్తుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మీ భార్య పేరు మీద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : Best Camera Phones : ఫొటోగ్రఫీ అంటే మీకు ఇష్టమా? ఈ నెలలో బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఈ పథకం దేశంలో బాగా పాపులర్ అయింది. ఈ పథకంలో చాలా మంది మహిళలు పెట్టుబడి పెడుతున్నారు. మీరు కూడా మీ భార్య పేరిట ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎలాంటి మార్కెట్ రిస్క్‌ ఉండదు.

మీరు పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితమని గమనించాలి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పథకంలో పెట్టుబడితో 7.5శాతం వడ్డీ :
మహిళా పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో మహిళల పేరిట రెండేళ్ల పాటు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడిని రూ.వెయ్యి నుంచి ప్రారంభించవచ్చు.

Read Also : Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!

గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. ఈ పథకంలో మీరు పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని కూడా పొందుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మీరు మీ భార్య కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి ఒకేసారి రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుత 7.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తే మీకు రెండు ఏళ్ల తర్వాత, రూ. 2,32,044 వస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకం కింద అకౌంట్ సులభంగా ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీప పోస్టాఫీసుకు వెళ్లాలి. అక్కడి నుంచి మీరు ఈ పథకం అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక ఫారమ్‌ను తీసుకొని నింపాలి. ఆ తరువాత, అవసరమైన డాక్యుమెంట్లను దరఖాస్తుకు జత చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత మీ అకౌంట్ పేరుతో స్కీమ్ ఓపెన్ అవుతుంది.