బ్యాంకింగ్ సేవలను పునరుద్దరించిన యస్ బ్యాంక్

తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)మారటోరియం విధించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్-3వరకు ఒక్కొక్క యస్ బ్యాంక్ డిపాజిటర్ రూ.50వేలకు మంచి విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంక్ బోర్డుని కూడా ఆర్బీఐ రద్దు చేసి,అడ్మినిస్ట్రేటర్ గా ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తిని నియమించిన విషయం తెలిసిందే.
ఆర్బీఐ విధించిన మారటోరియం బుదవారం సాయంత్రం ఆరు గంటలకు ఎత్తివేయబడింది. మా బ్యాంకింగ్ సర్వీసులు ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి. కస్టమర్లు పూర్తిస్థాయిలో బ్యాంకు సర్వీసులను పొందవచ్చు. మీ సహనానికి,సహకారానికి ధన్యవాదాలు అంటూ యస్ బ్యాంక్ ఓ ట్వీట్ లో తెలిపింది.
మార్చి-6న ఆర్బీఐ…యస్ బ్యాంక్ పునర్నిర్మాణ ఫ్లాన్ తో ముందుకొచ్చింది. యస్ బ్యాంకులో SBI పెట్టుబడి పెట్టడం,యస్ బ్యాంకులో 49శాతం వాటాని SBIదక్కించుకోవడమే ఈ ఫ్లాన్. ఆ తర్వాత వెంటనే విత్ డ్రా లిమిట్ ఎత్తివేయబడింది.