ట్రక్కు,మినీ బస్సు ఢీ….అయిదుగురు మృతి

  • Published By: murthy ,Published On : November 14, 2020 / 12:49 PM IST
ట్రక్కు,మినీ బస్సు ఢీ….అయిదుగురు మృతి

Updated On : November 14, 2020 / 12:53 PM IST

5 killed, 6 injured in Road accident at Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై ట్రక్కు, మినీ బస్సు ఢీ కొన్న ఘటనలో అయిదుగురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు వ్యక్తులు ఒక మినీ బస్సులో ముంబై నుంచి గోవా వెళుతుండగా… పూణే-బెంగుళూరు హైవే మీద,సాతారా జిల్లాలోఈ ప్రమాదం సంభవించింది.

ఒక వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీ కొట్ట్దింది. ఆసమయంలో వాహనాల వేగం ధాటికి మినీ బస్సు వంతెన పై నుంచి 50 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, చిన్నారి ఉన్నారు.