లోన్ తీర్చమని అడిగిన బ్యాంకు అధికారులపై రేప్ కేస్ పెడతానన్న మహిళ

బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలు ఎగ్గొట్టటానికి కొంత మంది దేశాలు విడిచి పారిపోతుంటే…. మరికొందరు బ్యాంకు అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చమని అడగటానికి వచ్చిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోగా అధికారులపై అత్యాచార కేసు పెడతానని బెదిరించింది ఒక మహిళ.
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఇందిరా నగర్ లో సంగీత దంపతులు నివసిస్తున్నారు. సంగీత భర్త బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అందుకు సంబంధించి రుణం తిరిగి చెల్లించమని బ్యాంకు అధికారులు వారి ఇంటికి వెళ్లి సంగీత భర్తను అభ్యర్ధించారు.
https://10tv.in/tamil-nadu-maths-teacher-in-buys-16-smartphones-for-her-students-to-attend-online-classes/
దీనికి ఆమె అధికారులపై ఫైర్ అయ్యారు. బ్యాంకు అధికారులను కించపరిచేలా మాట్లాడారు. నా భర్తను లోను కట్టమని అడగటానికి నీకెంత ధైర్యం… అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు నన్ను రేప్ చేశారని…మీ మీద అత్యాచారం కేసుపెడతానని బెదిరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీత బెదిరిస్తున్నప్పుడు అధికారులు ఆమె కాళ్ళు పట్టుకోటానికి కూడా సిధ్దమయ్యారు. అనంతరం వారంతా ఇందిరా నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సామాజిక కార్యకర్త ప్రియా ఆర్య సంగీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగీత తన హక్కులు, చట్టాలను దుర్వినియోగం చేసిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కోన్నారు. సంగీత పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామిని బెంగుళూరు తూర్పు మండలం డీసీపీ శరణప్ప తెలిపారు.
Bank people came home to do recovery for a loan,just look at this woman’s audacity the way she has behaved with them!
At this rate what recovery can happen? pic.twitter.com/UX4DrRbkJA— Lotus (@LotusBharat) September 6, 2020