ప్రియుడితో లేచిపోయి…భర్తను జైలుకు పంపాలనుకుంది

  • Published By: murthy ,Published On : August 4, 2020 / 10:36 AM IST
ప్రియుడితో లేచిపోయి…భర్తను జైలుకు పంపాలనుకుంది

Updated On : June 26, 2021 / 11:34 AM IST

వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా ప్రజలువాటివైపే ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. హాయిగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలోకి మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేర నేపధ్యం కలిగదిన అతడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే జైలుకు పంపి ప్రియుడితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంది.కానీ కధ అడ్డం తిరిగి పోలీసులకు బుక్కయ్యింది.



బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ లో నివసించే కారు డ్రైవర్ (32)తో ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతికి వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఇటీవల పోలీసు స్టేషన్ లో నిర్వహించే కుటుంబ సలహా కేంద్రానికి ఒక మహిళ ఫోన్ చేసి భర్త తనను వేధిస్తున్నాడని, అనధికారికంగా చీటీలు నిర్వహిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

చీటీల వ్యాపారం వద్దు అన్నందుకు తనను ఇంటి నుంచి బయటకు గెంటి వేశాడని వాపోయింది. దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యురాలు అపర్ణ పూర్ణేష్ ఆ మహిళ నుంచి పూర్తి వివరాలు అన్నీ తెలుసుకుని, భర్త ఫోన్ నెంబరు తీసుకుని అతడిని విచారించగా…సదరు ఆంటీ బాగోతం బయటపడింది.



కుటుంబ సహాయ కేంద్రానికి ఫోన్ చేసిన మహిళ, కారు డ్రైవర్ భార్య ఒక్కరే. కొద్ది నెలల క్రితం కారుడ్రైవర్ భార్య మరికొందరు స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్ళింది. ఆ విహార యాత్రకు వచ్చిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి తరచూవాళ్లిద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవటం మొదలెట్టారు. భర్తకు తెలియకుండా సాగుతున్నవారి సంభాషణ క్రమంగా ప్రేమగా మారింది.

10 రోజుల క్రితం ఆ మహిళ, ఇల్లు వదిలి తన ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య కనపడకపోవటంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో డ్రైవర్ భార్య తన ప్రియుడితో ఉంటూ…భర్తను జైలుకు పంపే యోచనలో కుటుంబ సలహా కేంద్రంలో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్నారు.



రంగంలోకి దిగిన పోలీసులు మహిళను తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదుతో భర్తను జైలుకు పంపాలనుకున్నట్లు మహిళ తెలిపింది. కాగా… ఆమెతో కాపురం చేసేందుకు భర్త సుముఖంగా లేక పోవటంతో పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.