Crime News: అమ్మాయి కోసం ఇంటర్, డిగ్రీ విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

ఓ అమ్మాయి కోసం కాలేజ్‌లో ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. విషయాన్ని గుర్తించిన 18 ఏళ్ల ఓ విద్యార్థి వారి మధ్యకు వెళ్లి.. వారి మధ్య నెలకొన్న గొడవ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెడికల్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలో చోటుచేసుకుంది.

Crime News: అమ్మాయి కోసం ఇంటర్, డిగ్రీ విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

Student

Updated On : January 19, 2023 / 11:38 AM IST

Crime News: ఓ అమ్మాయి కోసం కాలేజ్‌లో ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. విషయాన్ని గుర్తించిన 18 ఏళ్ల ఓ విద్యార్థి వారి మధ్యకు వెళ్లి.. వారి మధ్య నెలకొన్న గొడవ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెడికల్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఆ ఇద్దరు విద్యార్థులూ 12వ తరగతి వారేనని చెప్పారు. ప్రాథమిక విచారణలో తేలిన వివరాలు ప్రకారం… ఓ అమ్మాయి విషయంలోనే 11, 12వ తరగతి విద్యార్థులు ఓ గ్రూపుగా, బీఎస్సీ విద్యార్థులు మరో గ్రూపుగా ఏర్పడి ఘర్షణకు దిగారని చెప్పారు.

వారి మధ్యలోకి వెళ్లిన కార్తీక్ అనే 18 ఏళ్ల మరో విద్యార్థిని 12వ తరగతి విద్యార్థి ఒకరు పొడిచి చంపాడని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

PM Narendra Modi: నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. ముంబైలో రోడ్ షో..