Amitabh And Jaya Bachchan : అమితాబ్-జయా బచ్చన్‌ల వైవాహిక జీవితం చక్కగా ఉండటం వెనుక రహస్యం చెప్పిన శ్వేతా బచ్చన్

బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్‌లు 50 వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో వారి కుమార్తె శ్వేతా బచ్చన్ తల్లిదండ్రుల ఫోటోతో పాటు తాను షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Amitabh And Jaya Bachchan : అమితాబ్-జయా బచ్చన్‌ల వైవాహిక జీవితం చక్కగా ఉండటం వెనుక రహస్యం చెప్పిన శ్వేతా బచ్చన్

Amitabh And Jaya Bachchan

Updated On : June 3, 2023 / 12:31 PM IST

Jaya Bachchan tweet viral : బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్‌లు 50 వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేకమంది సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంలో వారి కూతురు శ్వేతా బచ్చన్ తల్లిదండ్రుల ఫోటోతో పాటు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anushka Sharma : అనుష్క, అమితాబ్ బైక్ రైడ్.. ముంబై పోలీసులు ఫైన్‌.. జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

అమితాబ్-జయా బచ్చన్‌ల 50వ పెళ్లిరోజు సందర్భంగా కూతురు శ్వేత తల్లిదండ్రుల పాత ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ’50వ పెళ్లిరోజులోకి అడుగుపెట్టిన తల్లితండ్రులకు శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు గోల్డెన్.. ఒకసారి మీ వైవాహిక జీవితం ఇంత చక్కగా ఉండటానికి రహస్యం ఏంటని అడిగినప్పుడు మా అమ్మ ‘ప్రేమ’ అని.. మా నాన్న ‘భార్య’ అని చాలా సింపుల్‌గా క్యూట్‌గా సమాధానాలు చెప్పారు’ అనే శీర్షికతో శ్వేతా బచ్చన్ తన పోస్టును షేర్ చేశారు.

 

ఇక శ్వేత ఫోటోకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు.డైరెక్టర్ జోయా అక్తర్ ‘ఎంత అందంగా ఉన్నారు’ అన్నారు. శ్వేత కుమార్తె నవ్య నవేలి నంద హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ‘స్వర్ణ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ చంకీపాండే విషెస్ చెప్పారు.
Amitabh Bachchan : రోడ్డుపై వెళ్తున్న ఓ పోలీస్ వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్.. వీడియోలో ఏముంది.. అంటే?

అమితాబ్ బచ్చన్ తన పెళ్లి.. పెళ్లిరోజు గురించి తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ఈ జంట  ప్రేమలో పడ్డాకా చాలా సంవత్సరాల తర్వాత 1973 లో పెళ్లి చేసుకున్నారు. శ్వేతా బచ్చన్ నందా మరియు అభిషేక్ బచ్చన్‌లు వీరి పిల్లలు. అమితాబ్-జయా బచ్చన్‌లు సిల్సిలా, షోలో, జంజీర్, చుప్కే చుప్కే మరియు కభీ ఖుషీ కభీ గమ్ వంటి అనేక సినిమాల్లో కలిసి పని చేశారు. ప్రస్తుతం అమితాబ్ ప్రాజెక్ట్ K లో దీపికా పదుకొణె మరియు ప్రభాస్‌లతో నటిస్తున్నారు. జయా బచ్చన్ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ కహానీ’లో కీలక పాత్ర పోషించారు.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan)