తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని మందలించినందుకు హత్యకు గురైన భర్త

  • Published By: murthy ,Published On : September 3, 2020 / 09:40 AM IST
తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని మందలించినందుకు హత్యకు గురైన భర్త

Updated On : September 3, 2020 / 10:47 AM IST

దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉండే సురేందర్ అనే వ్యక్తి గత వారం సాగర్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు.



అది తెలిసిన సాగర్ సురేందర్ని నిలదీసాడు. దీంతో వారి మధ్య గొడవ జరగటంతో సాగర్, సురేందర్ ను కొట్టాడు. ఇది జరిగిన 3రోజుల తర్వాత, ఆగస్ట్ 31న, సురేందర్ మద్యం సేవించి సాగర్ ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న సురేందర్, సాగర్ తోనూ, అతడి భార్యతోనూ గొడవకు దిగాడు. వాతావరణం ఉద్రిక్తంగా మారటంతో సాగర్ భార్య, రక్షించమని గట్టిగా అరిచింది.
https://10tv.in/tdp-chief-chandrababu-meets-acham-naidu-and-kollu-ravindra/
ఈ లోపు సురేందర్ తన వద్ద ఉన్న కత్తితో సాగర్ ను మెడపై కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. అది చూసిన సాగర్ భార్య కుప్పకూలి పడిపోయింది. సాగర్ భార్య అరుపులు విన్న చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకునే సరికి సురేందర్ పరారయ్యాడు.



సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి సాగర్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాగర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సాగర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేందర్ కోసం గాలిస్తున్నారు.