భార్య అక్రమ సంబంధం : తల నరికి ప్రియుడి ఇంటి ముందు పడేసిన భర్త

Sangareddy : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తనభార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో భర్త ఆమె తల నరికి ప్రియుడి ఇంటి ముందు పడేశాడు.
జిల్లాలోని నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో గొల్ల అనసూజ. సాయిలు దంపతులు. అనసూజ నారాయణఖేడ్ లో నివాసం ఉండే జైపాల్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంగతి గ్రహించిన సాయిలు, కోపంతో భార్య అనసూజను హత్యచేశాడు.
అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేసాడు. మొండాన్ని అనంతసాగర్ లోనే ఉంచి, అనసూజ తలను నారాయణఖేడ్ లోని ఆమె ప్రియుడు జైపాల్ రెడ్డి ఇంటి ముందు పడేశాడు. అనంతరం సాయిలు నారాయణఖేడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఘటనా స్ధలికి వచ్చిన పోలీసులు సాయిలు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాయిలును అదుపులోకి తీసుకుని ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు.