Illegal Relationship: ప్రియుడితో కలిసి కుమారుడ్ని హతమార్చిన తల్లి.. నెల రోజుల తరువాత గుట్టురట్టు

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి మూడేళ్ల కొడుకు తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. పైగా పోలీసులకు తన కొడుకు కుర్చీలో నుంచి కిందపడి చనిపోయాడని ఫిర్యాదు చేసింది.. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లే హంతకురాలని, అక్రమ సంబంధమే ఇందుకు కారణమని తేల్చారు.

Illegal Relationship: ప్రియుడితో కలిసి కుమారుడ్ని హతమార్చిన తల్లి.. నెల రోజుల తరువాత గుట్టురట్టు

3years baby killed

Updated On : August 29, 2022 / 3:11 PM IST

Illegal Relationship: వివాహేతర సంబంధం మత్తులో ఓ తల్లి కన్న కొడుకునే బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కనీస మానవత్వాన్ని మరిచి ప్రియుడితో కలిసి మూడేళ్ల కుమారుడిని కషాయితల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన మూషీరాబాద్ లో చోటు చేసుకుంది. నెల రోజుల తరువాత అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు.

Crime News: హర్యానాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిగుట్టలో నివాసముంటున్న ఓ మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహేతర సంబంధానికి మూడేళ్ల కొడుకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి తల్లి దారుణానికి పాల్పడింది. కన్న కొడుకును హత్యచేసింది. ఈ ఘటన నెల రోజుల క్రితం చోటు చేసుకుంది. తన కొడుకు కుర్చీమీద నుంచి కిందపడి మరణించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Crime News: అవివాహితపై నకిలీ స్వామీజీ ఐదేళ్లుగా అత్యాచారం.. భార్యతో వీడియోలు తీయించి బెదిరింపు..

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ సమయంలో తల్లి ప్రవర్తనపై అనుమానం రావటంతో ఆమెపై నిఘాపెట్టారు. వారి అనుమానం బలపడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించి ప్రియుడుతో కలిసి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.