కుటుంబ కలహాలు… సైకోలా మారిన డాక్టర్

  • Published By: murthy ,Published On : October 27, 2020 / 02:00 PM IST
కుటుంబ కలహాలు… సైకోలా మారిన డాక్టర్

Updated On : October 27, 2020 / 2:36 PM IST

son-in-law sword attack on wife and her parents : భార్యా భర్తల గొడవతో దసరా పండగ పూట ఆఇంట విషాదం నెలకొంది. అల్లుడు చేసిన దాడిలో రక్తం చింది మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి.

కర్ణాటక, హుబ్లీలోని లింగరాజు నగర్లో నివసించే శంకర్ ముసన్నవర్ లా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె లత ఉన్నారు. వైద్యురాలైన లతను, దంత వైద్యుడైన సంతోష్ కు ఇచ్చి గతంలో వివాహాం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు.



కాగా…. భార్యా,భర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలను తీసుకుని లత తండ్రి వద్దకు వచ్చి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తోంది. అప్పుడప్పుడు సంతోష్ మామగారింటికి వచ్చి భార్యను ఇంటికి పంపించమని అడుగుతూ ఉండేవాడు. వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం రాకపోవటంతో లత పుట్టింట్లోనే ఉంటోంది.
https://10tv.in/madhya-pradesh-man-arrested-for-live-streaming-sexual-acts-with-2-wives-on-apps-2nd-wife-wife-approaches-police/
ఎన్ని సార్లు వచ్చి అడిగినా భార్య కాపురానికి రాకపోయేసరికి సంతోష్ లో కోపం పెరిగి పోయింది. అక్టోబర్ 24 శనివారం ఉదయాన్నే అత్తవారింటికి వచ్చాడు. ఉదయాన్నేవాకింగ్ కు బయలు దేరుతున్న మామ శంకర్ ముసన్నవర్… అల్లుడు వచ్చేసరికి ఆగిపోయారు. సంతోష్ ఇంట్లోకి రావటంతోటే కత్తి తీసుకుని అత్త,మామలు భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.



ఉన్మాదిలా మారి సంతోష్ చేసిన దాడిలో మామ శంకర్ అక్కడికక్కడే చనిపోగా అత్త, భార్య లతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని సంతోష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్ధలాన్ని పోలీసు కమీషనర్ లాబూరామ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.