కేరళలో పేలుడు ఇద్దరి మృతి

  • Published By: murthy ,Published On : September 21, 2020 / 12:51 PM IST
కేరళలో పేలుడు ఇద్దరి మృతి

Updated On : September 21, 2020 / 1:23 PM IST

కేరళలోని ఎర్నాకుళంలో జిల్లాలోని మలయటూర్ వద్ద సామవారం భారీ పేలుడు సంభవించింది. మలయటూర్‌లోని క్వారీలో రాళ్ళను పేల్చటానికి పేలుడు పదార్ధాలుఉంచే భవనంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ వలస కూలీలు మరణించారు.




మరణించిన వారిని తమిళనాడుకు చెందిన పెరియానాన్, కర్నాటకకు చెందిన డీ నాగాగా పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారుఝూమున గం.3.30 సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు కాలడి పోలీసులు తెలిపారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.శిధిలాల కింద మరి కొందరు ఉండివుండవచ్చని తెలుస్తోంది.