కోడలిపై కన్నేసిన మామ….. లైంగిక వేధింపులు

ఉపాధి కోసం ఉన్నఊరు వదిలి కొడుకు వేరే దేశాలు పట్టిపోతే ఇంట్లో ఉన్న కోడలిని కన్నకూతురులా చూసుకోవాల్సిన మామగారు ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. మామ పెట్టే వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
నిజామాబాగ్ జిల్లా కామారెడ్డి మండలం లింగాపూర్ కు చెందిన మల్లేశం(60) కుమారుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. బతుకు తెరువు కోసం కొడుకు విదేశాల్లో ఉండటంతో కోడలు ఇంటివద్దే ఉంటోంది. మల్లేశం కోడలిని లైంగికంగా వేధించటం మొదలెట్టాడు.
ఆ వేధింపులు తట్టుకోలేని కోడలు శానిటైజర్ తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. వారంరోజులు చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరింది. కోడలు ఒకసారి ఆత్మహత్య చేసుకున్నామామ బుద్ది మారలేదు.
దీంతో ఆమె తన గోడు బంధువుల వద్ద వెళ్లబోసుకుంది. దీంతో వారు ఆగస్ట్ 16న వచ్చి మామను నిలదీసి దేహశుద్ది చేశారు. అనంతరం దేవునిపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి, మల్లేశంను పోలీసులకు అప్పచెప్పారు.