బైక్ అదుపు తప్పి, కింద పడి కానిస్టేబుల్ మృతి
police constable dies in bike accident in warangal rual district : రోడ్డుపై వెళుతుండగా ప్రమాద వశాత్తు పడిపోయి కానిస్టేబుల్ దుర్మరణం చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని నర్సంపేట పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న బర్ల మహేశ్..శనివారం రాత్రి లింగగిరి గ్రామంలో జరిగిన ఒక శుభ కార్యక్రమానికి హజరయ్యాడు.
అనంతరం ద్విచక్ర వాహానంపై సొంతూరైన సంగెం మండలం రామ చంద్రాపురానికి బయలు దేరాడు.ఈ క్రమంలో లింగగిరి శివార్ల లో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో తలకు గాయమై అక్కడి కక్కడే మరణించాడు. స్దానికుల సమచారం తో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
