14ఏళ్ల వికలాంగ కూతురిపై తండ్రి అత్యాచారం..

తండ్రి అంటే బిడ్డలకు ఓ ధైర్యం. ఓ భరోసా..తమకు ఏమన్నా ప్రమాదం వస్తే నాన్న ఉన్నాడనే మాటకు అర్థం లేకుండా చేశాడు ఓ దుర్మార్గపు తండ్రి. వికలాంగురాలైన కూతురిపై కామ పిశాచి విరుచుకుపడి అత్యాచారానికి తెగబడిని అమానవీయ ఘటన త్రిపురలోని లాల్చెరా గ్రామంలో మంగళవారం (జూన్ 9,2020) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
లాల్చెరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో.. వికలాంగురాలైన తన 14ఏళ్ల కూతురి కన్నేశాడు. మద్యం మత్తులో తలకెక్కగా విచక్షణ మరచి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాన్నా..నాన్నా..నన్ను విడిచిపెట్టు అంటూ ఆ చిన్నారి వేడుకున్నా ఆ దుర్మార్గుడు వదల్లేదు. కొట్టి చిత్ర హింసలు పెట్టి..అత్యాచారం చేశాడు.
తల్లి ఇంటికి తిరిగి రాగా..ఏడుస్తూ..జరిగిన విషయాన్ని చెప్పింది.దీంతో ఆగ్రహించిన ఆ తల్లి తన బిడ్డ పరిస్థితిని పోలీసులకు చెప్పుకుంది. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.