Fire Accident 17 Died : ఇండోనేషియాలోని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.

Fire Accident 17 Died : ఇండోనేషియాలోని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

fire accident

Updated On : March 4, 2023 / 6:53 AM IST

Fire Accident 17 Died : ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మెర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఆ తర్వాత ఇది అనేక పేలుళ్లకు కారణమైంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటినా ఖాళీ చేయించారు. భారీ అగ్ని ప్రమాదంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Fire Broke Out : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన ఇళ్లు

సమాచారం అందిన వెంటనే 180 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు, ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.