Love Affair Theft : ప్రియుడితో పరారీకి స్కెచ్ సొంతింట్లోనే దొంగతనం

ఇంట్లో పెద్దలు తన ప్రేమను అంగీకరించలేదని.... డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ప్రియుడితో కలిసి సొంతింట్లోనే ఓ యువతి దొంగతనం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది.

Love Affair Theft : ప్రియుడితో పరారీకి స్కెచ్ సొంతింట్లోనే దొంగతనం

19 Years Old Girl Helps Lover Steal Steal Money From Her House Arrested

Updated On : May 31, 2021 / 5:21 PM IST

Love Affair Theft : ఇంట్లో పెద్దలు తన ప్రేమను అంగీకరించలేదని…. డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ప్రియుడితో కలిసి సొంతింట్లోనే  ఓ యువతి దొంగతనం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది. గోసాయిగంజ్ ప్రాంతంలో నివసించే వ్యాపార వేత్త మనోజ్ ఇంట్లో దొంగలు పడి రూ. 13లక్షల రూపాయల నగదు, రూ.3లక్షల విలువైన బంగార ఆభరణాలు దొంగిలించారు. ఈ ఘటనపై యజమాని మనోజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇంటికి వేసిన గడియలు వేసినట్లే ఉన్నాయి… కానీ.. లాకర్లు తెరిచి దొంగలు ఇంట్లో నగదు, బంగారం దోచుకెళ్లారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన దాఖలాలు పోలీసులకు కనడలేదు. దొంగలు ఇంట్లోకిఎలా ప్రవేశించారనే విషయంలో పోలీసులకు క్లూ దొరకలేదు. విచారణలో భాగంగా పోలీసులు మనోజ్ కుమార్తెను విచారించగా అసలు నిజాలు బయట పడ్డాయి. ఆమె నేరం ఒప్పుకుంది.

మనోజ్ కుమార్తె ఖుష్బూ(19) వినయ్ యాదవ్ అనే అతనితో  ప్రేమలో పడింది. వారి ప్రేమను మనోజ్ ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. అందులో భాగంగా మే 28వ తేదీ శుక్రవారం రోజు రాత్రి కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చింది. అది తాగిన మనోజ్ అతని భార్య నిద్రలోకి జారుకున్నారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వినయ్ యాదవ్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి  చోరీ చేసి వెళ్లిపోయారు. వారు వెళ్లగానే ఆమె ఇంటి తలుపులు వేసుకుని పడుకుంది. పోలీసు విచారణలో శుక్రవారం రాత్రి నువ్వు ఎందుకు టీ తాగలేదని పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవటంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది.

ఖుష్బూని   పోలీసులు అదుపులోకి తీసుకుని  ప్రశ్నించే సరికి   తమ ప్రేమ సంగతి చెప్పి, నేరం ఒప్పుకుంది.  పోలీసులు ఆమె ప్రియుడు వినయ్ యాదవ్, అతనికి సహకరించిన శుభం యాదవ్ ను అదుపులోకి తీసుకుని చోరీ అయిన సొత్తు మొత్తం రికవరీ చేశారు.  సహనిందితుల్లో ఒకడైన పరారీలో ఉన్న రంజిత్ యాదవ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.