భార్యపై అనుమానం.. రెండు నెలల బిడ్డ తనకు పుట్టలేదంటూ రోడ్డు మీద వదిలేసిన తండ్రి

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 10:11 AM IST
భార్యపై అనుమానం.. రెండు నెలల బిడ్డ తనకు పుట్టలేదంటూ రోడ్డు మీద వదిలేసిన తండ్రి

Updated On : October 10, 2020 / 11:03 AM IST

2 month-old boy abandoned : భార్యకు పుట్టిన 2 నెలల మగబిడ్డ విషయంలో అనుమానం పెంచుకున్న భర్త వదిలేశాడు. తనకు పుట్టిన వాడు కాదంటూ చర్చి సమీపంలో విడిచిపెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే వాళ్ల ఐదేళ్ల కొడుకు కోసం కలిశారు. రెండు నెలల క్రితం ఆ మహిళ మరో కొడుక్కి జన్మ ఇచ్చింది. ఈ సంతానం తనది కాదంటూ అనుమానం పెంచుకున్న భర్త వదిలించుకోవాలనుకున్నాడు.

మహారాష్ట్రలోని పూణేలో చర్చి వద్ద కడ్కి అనే ప్రాంతంలో వదిలేశాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆ వ్యక్తిని, అతని భార్యని పోలీసులు అరెస్టు చేశారు.