Tiger : యూపీ అడవిలో యువకుడిని చంపిన పులి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడవిలో పశువుల మేత కోసం వెళ్లిన ఓ యువకుడిని పులి చంపేసిన ఘటన జరిగింది. పులి దాడిలో రోహిత్ చనిపోయాడని, శవం వద్ద జంతువు పాదముద్రలు కనిపించాయని డీఎఫ్ఓ బిస్వాల్ చెప్పారు....

Tiger
Tiger : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడవిలో పశువుల మేత కోసం వెళ్లిన ఓ యువకుడిని పులి చంపేసిన ఘటన జరిగింది. యూపీలోని ఉదయ్ పూ్ గ్రామానికి చెందిన రోహిత్ తాను పెంచుకుంటున్న జంతువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లాడు. అడవికి వెళ్లిన రోహిత్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు వెతికారు.
New Zealand : న్యూజిలాండ్‌లో కాల్పులు, ఇద్దరి మృతి..షూటర్ హతం
అడవిలో రోహిత్ సైకిల్, గడ్డి కోసే యంత్రం, గడ్డి కుప్పను గుర్తించారు. పొలంలో గాలించగా పులి పాద గుర్తులు కనిపించాయి. తర్వాత చెరకు పొలంలో రోహిత్ మృతదేహం లభ్యమైందని పోలీసులు చెప్పారు. (Man Killed By Tiger) అటవీశాఖ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సంజయ్ బిస్వాల్ సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామస్థులు పులి దాడి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Delhi : షాకింగ్ వీడియో.. మహిళా పైలట్, ఆమె భర్తను దారుణంగా కొట్టిన జనం
పులి దాడిలో రోహిత్ చనిపోయాడని, శవం వద్ద జంతువు పాదముద్రంలు కనిపించాయని డీఎఫ్ఓ బిస్వాల్ చెప్పారు. రోహిత్ ను చంపింది మగపులి అని పాదముద్రలను బట్టి తేల్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.