ఇండియా గేట్ దగ్గర యువకుడు ఆత్మహత్యాయత్నం

  • Published By: venkaiahnaidu ,Published On : December 18, 2019 / 03:59 PM IST
ఇండియా గేట్ దగ్గర యువకుడు ఆత్మహత్యాయత్నం

Updated On : December 18, 2019 / 3:59 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు,ఢిల్లీ,యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర్లో ఆందోళనకారులు నిరసన చేస్తున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-18,2019)ఇండియా గేట్ దగ్గర 25ఏళ్ల యువకుడు తనకుతాను నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు బాధితుడిని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.

యువకుడికి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని,పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధిత యువకుడిని ఒడిశాకు చెందిన కార్తీక్ మహేర్ గా గుర్తించారు. కార్తీక్ మానసిక స్థితి సరిగా లేదని అతడి సోదరుడు తెలిపాడని డీసీపీ సింఘాల్ తెలిపారు. కార్తీక్ కు పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని సింఘాల్ తెలిపారు.