లాక్ డౌన్ కాలంలో ఆ వీడియోలు షేర్ చేసినందుకు 41 మంది అరెస్టు

41 arrested circulating child pornography : లాక్ డౌన్ కాలంలో ఇళ్లకే పరిమితమయ్యారు. బోర్ ఫీలవకుండా ఉండేందుకు సోషల్ మీడియాను తెగ వాడేశారు. ప్రధానంగా యూత్..వీడియోస్, సినిమాలు చూస్తూ టైం పాస్ చేశారు. అయితే..కొంతమంది అశ్లీల వీడియోలు, ఫొటోలు చూస్తూ..టైం పాస్ చేశారు. దీనిని ఆన్ లైన్ లో షేర్ చేశారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వివిధ ఉద్యోగాల్లో పని చేసే వారు ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పోలీసులు 41 మందిని అరెస్టు చేశారు.
కోవిడ్ – 19 కాలంలో పిల్లలపై లైంగిక దోపిడి పెరిగిందని అధికంగా కంప్లైట్స్ వచ్చాయి. దీనిపై కేరళ సైబర్ సెల్ నిఘా పెంచింది. సైబర్ డోమ్ సహాయంతో..ఆపరేషన్ పి హంట్ 20.2లో ఆదివారం నిర్వహించిన హైటెక్ దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కరోనా లైఫ్, ఇతర పేరు పెట్టి చైల్డ్ పోగ్నోగ్రఫీ చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తున్నారని గ్రహించారు.
రాష్ట్రంలో మొత్తం 362 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 268 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు,హార్డ్ డిస్క్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ .10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేరం వెనుక ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసుల బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.