దారుణం : మంచినీళ్లు అడిగి మహిళపై అత్యాచారం

45 year old Woman gang-raped in MP, rod inserted into private parts : దేశంలో మహిళలపై రోజుకో దారుణం జరుగుతోంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో 50 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి ఆమె మర్మాంగాల్లో గ్లాస్ దూర్చిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళపై అత్యాచారం చేసి పశువుల్లా ప్రవర్తించారు మృగాళ్లు. అత్యంత దారుణంగా ఆమె శరీర భాగాల్లోకి ఇనుపరాడ్లు దించారు. మధ్యప్రదేశ్ లోని సింథి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయిన వితంతు తన ఇద్దరు కొడుకులు, సోదరితో కలిసి సింథి జిల్లాలోని హార్ది గ్రామం సమీపంలోని ఏకాంత ప్రదేశంలో జీవిస్తోంది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. జీవనోపాధి కోసం ఆ మహిళ తన సోదరితో కలిసి ఓ షాపు నడుపుతోంది. ఈక్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఆమె షాపు వద్దకు వచ్చి తాగడానికి నీళ్లు అడిగారు. నీళ్లు లేవని ఆమె చెప్పటంతో వారికి కోపం వచ్చింది.
మహిళపై ఆగ్రహించన వారు ఆమె నివసిస్తున్న ఇంటిని ధ్వంసం చేశారు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యంత కిరాతకంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుపరాడ్లు దించి పారిపోయారు. అనంతరం బాధితురాలిని ఆమె చెల్లెలు అస్పత్రికి తీసుకు వెళ్లింది.
మహిళ శరీర భాగాల్లోంచి తీవ్ర రక్తస్రావం కావటంతో మెరుగైన చికిత్స కోసం పక్కనే ఉన్న రేవా జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఆమె కొడుకులిద్దరూ ఇంట్లో లేరు. కాగా ప్రస్తుతం ఆమె పరిస్ధితి నిలకడగా ఉందని అమిలియా పోలీసు స్టేషన్ ఇన్ చార్జి దీపక్ బెహగల్ చెప్పారు. నిందితులను అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.