లాహోర్ లో బాంబు పేలుడు…5గురు మృతి

పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 8, 2019 / 05:10 AM IST
లాహోర్ లో బాంబు పేలుడు…5గురు మృతి

Updated On : May 8, 2019 / 5:10 AM IST

పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది.

పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బుధవారం (మే-8,2019) పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది. బాంబు పేలుడులో 5మంది ప్రాణాలు కోల్పోగా 24మంది గాయపడినట్లు లాహోర్ ఆపరేషన్స్ డీఐజీ అస్ఫక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం…పోలీస్ వాహనం టార్గెట్ గా 11వ శతాబ్దం నాటి డేటా దర్బార్ పుణ్యక్షేత్రపు మహిళల ప్రవేశ ద్వారం దగ్గర్లో బాంబు పేలుడు సంభవించింది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద సూఫీ పుణ్యక్షేత్రాల్లో ఒకటి లాహోర్ లో ఉన్న విషయం తెలిసిందే. బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరున్నది ఇంకా తెలియరాలేదు. గాయపడినవారిని మయో హాస్పిటల్ కు తరలించారు.

గాయాలపాలైన వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు లాహోర్ ఎస్పీ సయ్యద్ గజన్ ఫార్ షా తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మొహరించారు. బాంబు పేలుడు ఘటనను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.