రియల్ మర్డర్ : ‘దృశ్యం’ చూపించారు!

విక్టరీ వెంకటేశ్ నటించిన తెలుగు చిత్రం ‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమాలో కథనాయకుడి కుటుంబం ఓ వ్యక్తిని హత్యచేసి ఇంటి పెరడులో పూడ్చిపెట్టిన సన్నివేశం గుర్తుండే ఉంటుంది.

  • Published By: sreehari ,Published On : January 13, 2019 / 09:46 AM IST
రియల్ మర్డర్ : ‘దృశ్యం’ చూపించారు!

విక్టరీ వెంకటేశ్ నటించిన తెలుగు చిత్రం ‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమాలో కథనాయకుడి కుటుంబం ఓ వ్యక్తిని హత్యచేసి ఇంటి పెరడులో పూడ్చిపెట్టిన సన్నివేశం గుర్తుండే ఉంటుంది.

  • 22ఏళ్ల యువతిని చంపేసిన ఓ కుటుంబం.. దూరంగా తీసుకెళ్లి దహనం 

  • చచ్చిన కుక్కను పాతిపెట్టి.. కేసును తప్పుదొవ పట్టించే యత్నం

  • రెండేళ్ల తరువాత వీడిన మిస్టరీ.. ఐదుగురు నిందితులు అరెస్ట్  
     

ఇండోర్: విక్టరీ వెంకటేశ్ నటించిన తెలుగు చిత్రం ‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమాలో హీరో కుటుంబం ఓ వ్యక్తిని హత్యచేసి ఇంటి పెరడులో పూడ్చిపెట్టిన సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి దృశ్యాన్నే రియల్ గా చేసి చూపించి ఓ కుటుంబం కటకటాలపాలైంది. రెండేళ్ల క్రితం 22ఏళ్ల యువతిని అతిదారుణంగా ఐదుగురు కలిసి చంపేసి తేలివిగా పోలీసులను తప్పుదొవ పట్టించారు. రెండేళ్ల తరువాత వారి పాపం పండి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బంగంగా ప్రాంతంలో వెలుగుచూసింది.

పక్కా ప్లానింగ్ తో హత్యకు స్ర్కీన్ ప్లే..
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని బంగంగా ప్రాంతంలో జగదీశ్ కరోతియ అలియస్ కల్లు పెహాల్వాన్ (65) అనే బీజేపీ నేత కుటుంబం నివాసముంటోంది. అప్పట్లో ట్వింకిల్ దాగ్రే అనే యువతితో రాజకీయ నేత జగదీశ్ కు అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగా జగదీశ్ కుటుంబంలో చిచ్చు రేగింది. ఈ క్రమంలో ఎలాగైన యువతి దాగ్రే అడ్డు తొలగించుకోనేందుకు తండ్రీకొడుకులు కలిసి పథకం రచించారు. హత్య చేయడానికి ముందు.. వీరంతా కలిసి దృశ్యం సినిమాను చూశారట. విచారణలో వారే అంగీకరించారు. జగదీశ్ తన ముగ్గురు కుమారులు అజయ్ (36), విజయ్ (38), వినయ్ (31), మరో వ్యక్తి నీలేశ్ కశ్యప్ (28) నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురు నిందితులు పథకం ప్రకారం.. దృశ్యం సినిమా తరహాలో రెండేళ్ల క్రితం యువతి దాగ్రేను హత్య చేశారు. 

చచ్చిన కుక్కను పూడ్చిపెట్టి.. 
అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోలీసుల కళ్లుగప్పి దూరంగా తీసుకెళ్లి దహనం చేశారు. పోలీసులకు తమపై అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటి సమీపంలో గొయ్యి తీసి చచ్చిన కుక్కను అందులో పూడ్చిపెట్టారు. తెలివిగా పోలీసులను తప్పుదొవ పట్టించిన నిందితులు చేతులు దులిపేసుకున్నారు. రెండేళ్ల క్రితం అదృశ్యమైన యువతి కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారించగా ‘దృశ్యం’ రియల్ మర్డర్ బయటకు వచ్చింది.

మృతురాలి ఆభరణాలు ఆధారంగా.. 
యువతి దహనం చేసిన చోట ఆమె ఆభరణాలు, బ్రాస్ లెట్ ఆధారంగా విచారణ చేపట్టడంతో ఐదుగురు నిందితులు పట్టుబట్టారు. కుక్కను పాతిపెట్టిన విషయాన్ని నిందితులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు పాతిపెట్టిన స్థలాన్ని తిరిగి తవ్వడంతో కుక్క మృతదేహం బయటపడింది. అది చూసిన పోలీసులు షాకయ్యారు. పోలీసులను తప్పుదొవ పట్టించే ప్రయత్నంలో వీరి వ్యూహం బెడిసికొట్టింది. చివరికి యువతిని హత్యచేసింది ఈ ఐదుగురేనని పోలీసులు గుర్తించారు.