Old Woman Raped : వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి… చంపేసిన గ్రామస్తులు

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.

Old Woman Raped : వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి… చంపేసిన గ్రామస్తులు

60 Years Old Woman Raped Accused Killed By Villagers

Updated On : May 28, 2021 / 5:53 PM IST

Old Woman Raped : చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో గురుమూర్తి అనే వ్యక్తి తాగుడుకు అలవాటు పడి.. జులాయిగా తిరుగుతూ ఉండేవాడు.

శుక్రవారం ఉదయం గ్రామంలోని 60 ఏళ్ల వృధ్దురాలి వద్ద ఉన్న సొమ్ము తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడు. గురుమూర్తి ప్రయత్నాన్ని వృధ్దురాలు అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అతడు వృధ్దురాలిపై అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమె వద్ద ఉన్న రూ. 4 వేలు తీసుకున్నాడు. వృధ్ధురాలి పరిస్ధితి విషమంగా మారటంతో గ్రామస్తులు మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. వృధ్దురాలిపై జరిగిన అత్యాచారం విషయం తెలిసిన గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టారు. కోపం చల్లారక అతడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.