తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం..8మంది టూరిస్టులు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2019 / 09:01 AM IST
తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం..8మంది టూరిస్టులు మృతి

Updated On : October 15, 2019 / 9:01 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెల్ మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్‌కు వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20కిలీమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో టెంపో ట్రావెలర్ పడిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందగా,పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు అధికారులు.

మృతులందరూ కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. మొత్తం రెండు టెంపో ట్రావెలర్ లలో 26మంది వచ్చారు.  వీరందరూ నిన్న భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం బయల్దేరారు. అయితే ఇవాళ ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడిపోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందారు.