Newlywed Couple Death : వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు అనుమానాస్పద మృతి.. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మృతదేహాలు

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Newlywed Couple Death : వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు అనుమానాస్పద మృతి.. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మృతదేహాలు

DEAD

Updated On : February 23, 2023 / 12:57 AM IST

Newlywed Couple Death : ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లామ్ (24), కహ్కషా బానో (22) ఆదివారం వివాహం చేసుకున్నారు. వారి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సి ఉంది. వారు తమ గదిలో ఫంక్షన్‌కు సిద్ధమవుతుండగా, వరుడి తల్లి వధువు అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అయితే, గది లోపలి నుండి తాళం వేసి ఉంది. వారు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా నవ దంపతులు రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

Couple Suicide : అసలేం జరిగింది? ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య.. అర్థరాత్రి వరకు ఫోన్‌లో మాటలు..

కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి, కత్తిపోట్లతో ఉన్న నవ దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్ద కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి భార్యపై కత్తితో దాడి చేసిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.