Couple Suicide : అసలేం జరిగింది? ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య.. అర్థరాత్రి వరకు ఫోన్‌లో మాటలు..

నిన్న వధువు ప్రియాంక ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Couple Suicide : అసలేం జరిగింది? ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య.. అర్థరాత్రి వరకు ఫోన్‌లో మాటలు..

Couple Suicide

Updated On : February 6, 2022 / 10:06 PM IST

Couple Suicide : ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మెదరమెట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న వధువు ప్రియాంక ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త పొదిలి మహానంది.. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

2021 డిసెంబర్ 29న ప్రియాంక, మహానందిల వివాహం జరిగింది. మహానంది ఛత్తీస్ ఘడ్ లో CISF జవాన్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు ఒంటి గంట వరకు భార్య, భర్త ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ, శనివారం ఉదయం ప్రియాంక.. ఆదివారం మహానంది సూసైడ్ చేసుకున్నారు.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫోన్ సంభాషణ వస్తే పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నవ దంపతుల ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.