Youngster Died Taking Selfie : సెల్ఫీ దిగుతూ డిండి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.

Youngster Died Taking Selfie : సెల్ఫీ దిగుతూ డిండి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి

Youngster Died Taking Selfie

Updated On : September 11, 2022 / 5:12 PM IST

Youngster Died Taking Selfie : సెల్ఫీ మోజులో పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ మోజు మరొకరి ప్రాణం తీసింది. నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

హైదరాబాద్‌ ఎర్రగడ్డకు చెందిన మనోజ్ (22) అనే యువకుడు శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న డిండి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు.

Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు

అయితే అప్పటికే చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలు నిలిపివేశారు. ఆదివారం ఉదయం ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మనోజ్ మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.