Young Woman Suicide : ఐఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

young woman suicide
Young Woman Suicide : మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ ఖర్బీ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి యువతి నివసిస్తున్నారు. కుటీర పరిశ్రమను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. హింగ్నా పట్టణంలోని రాయ్‌సోనీ కాలేజీలో యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
Love : పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ఈ నేపథ్యంలో యువతి ఐఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరింది. ఐఫోన్ కొనివ్వడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే కొనివ్వకుండా జాప్యం చేస్తున్నారని ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.