Abdullapurmet Naveen Case : బాబోయ్.. హత్య చేసి వారం తర్వాత శరీర భాగాలు తగలబెట్టి.. నవీన్ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

3 నెలల క్రితమే నవీన్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. 2 నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తి కొన్నాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను మర్డర్ చేశాడు హరిహరకృష్ణ. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరి మద్యం తాగారు.

Abdullapurmet Naveen Case : బాబోయ్.. హత్య చేసి వారం తర్వాత శరీర భాగాలు తగలబెట్టి.. నవీన్ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Updated On : February 27, 2023 / 11:04 PM IST

Abdullapurmet Naveen Case : సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహితుడు నవీన్ ను హరిహరకృష్ణ చంపేశాడు.

3 నెలల క్రితమే నవీన్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. 2 నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తి కొన్నాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను మర్డర్ చేశాడు హరిహరకృష్ణ. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరి మద్యం తాగారు. యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్ ను హత్య చేశాడు హరి. తర్వాత కత్తితో నవీన్ శరీర భాగాలు వేరు చేశాడు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ ఆడియో, తనకేమీ తెలియనట్లు నటించిన హరి

శరీర భాగాలను బ్రాహ్మణపల్లి పరిధిలో పడేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న హసన్ అనే ఫ్రెండ్ ఇంటికి హరి వెళ్లాడు. అక్కడ స్నానం చేశాక హత్య విషయాన్ని హసన్ కు చెప్పాడు హరి. మరుసటి రోజు నవీన్ మర్డర్ విషయాన్ని ప్రియురాలికి కూడా చెప్పాడు నిందితుడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో తిరిగాడు. ఫిబ్రవరి 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. హత్య చేసిన స్పాట్ కి వెళ్లాడు. పారేసిన శరీర విడి భాగాలను సేకరించాడు. వాటన్నింటిని తగలబెట్టాడు. అదే రోజు సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు హరిహరకృష్ణ.

నవీన్, హరి ఇద్దరూ స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుతున్నారు. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అదే ఇంతటి దారుణానికి దారితీసింది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. నవీన్ కారణంగా ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుందోనని హరి భయపడ్డాడు. నవీన్ ను లేపేసి ప్రియురాలిని దక్కించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరి

పార్టీ పేరుతో నవీన్ ను పిలిపించి మర్డర్ చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను వేరు చేసి సైకోలా ప్రవర్తించాడు. నవీన్ వేళ్లు, పెదాలు, మర్మాంగాలు కోసి వాటి ఫొటోలు తన ప్రియురాలికి పంపాడు. అంతేకాదు గుండెను బయటకు తీశాడు. తలను కూడా వేరు చేశాడు. హరిహరకృష్ణ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

నవీన్ హత్యపై నిందితుడు హరిహరకృష్ణ తండ్రి స్పందిస్తూ.. నవీన్ హత్య మద్యం మత్తులో జరిగి ఉంటుందని చెప్పారు. అయితే, హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడని, దీనివెనక మరికొంతమంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్, హరికృష్ణల స్నేహితురాలును కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.