Woman Tied To Pole : వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో.. మహిళపై దారుణం
సొంత కుటుంబసభ్యులే ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మహిళ భర్త అతడి కుటుంబసభ్యులు ఆటవికంగా ప్రవర్తించారు.

Woman Tied To Pole
Woman Tied To Pole : అరాచకాలకు కేరాఫ్ గా చెప్పుకునే బీహార్ లో మరో ఘోరం జరిగింది. సొంత కుటుంబసభ్యులే ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మహిళ భర్త అతడి కుటుంబసభ్యులు ఆటవికంగా ప్రవర్తించారు. మహిళను కరెంట్ పోల్ కి కట్టేసి కొట్టారు. ఈ ఘటన రోహ్తాస్ జిల్లాలోని సింగ్ పూర్ లో జరిగింది.
Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం
సింగ్ పూర్ కి చెందిన ఓ మహిళ గ్రామంలోని మరో వ్యక్తితో విహహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను కరెంట్ పోల్ కి కట్టేసి కొట్టారు. మహిళ భర్త దీపక్ రామ్, మామ, ముగ్గురు పిల్లలు బాధితురాలిని చితకబాదారు. ఈ విషయం పోలసులకు తెలియడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి వచ్చారు. బాధితురాలని రక్షించారు.
Uttar Pradesh : నర్స్ పై అత్యాచారం, హత్య ?
కాగా, తన భార్య తీరుపై భర్త దీపక్ రామ్ ఇదివరకే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. మీరు జోక్యం చేసుకోవాలని, తన భార్యకు బుద్ధి చెప్పాలని కోరాడు. దీంతో పోలీసులు దీపక్ రామ్ దంపతులను, వారిని కుటుంసభ్యులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలో ఘోరం జరిగింది. దీపక్ రామ్ అతడి కొడుకులు.. మహిళను చెట్టుకి కట్టేసి దారుణంగా కొట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను రక్షించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దీపక్ రామ్, మామ, ముగ్గురు పిల్లలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాఫ్తు చేపట్టారు.