ఏసీపీ మల్లారెడ్డిపై వేటు : జయరాం హత్యకేసు నిందితుడితో లింకులు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసుతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి తో ఏసీపీ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అతనితో మల్లారెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తేలటంతో, మల్లారెడ్డిని అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.
ఓ కేసు విషయంలో రాకేష్ ఏసీపీ తో సంబంధాలు పెంచుకున్నాడని ఎస్పీ తెలిపారు. మల్లారెడ్డి రాకేష్ తో ఫోన్లో టచ్ లో ఉన్నాడని, మల్లారెడ్డిపై విచారణ జరుపుతామని ఎస్పీ వివరించారు. మల్లారెడ్డి స్ధానంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా వనస్ధలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు.