ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

హైదరాబాద్ లోని ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైట్ లెటర్ రాశారు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 11:59 AM IST
ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

Updated On : March 9, 2020 / 11:59 AM IST

హైదరాబాద్ లోని ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైట్ లెటర్ రాశారు.

హైదరాబాద్ లోని ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైట్ లెటర్ రాశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ మిత్లాకు సంబంధించిన విల్లాలోని 57లో అతని బెడ్ రూమ్ లో పది గంటల సమయంలో తన లైసెన్స్ డ్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రధానంగా కుటుంబ తగాదాలతోపాటు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా రవీందర్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర కుమార్ బెడ్ రూమ్ లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. 

2016లో రవీందర్ కుమార్ కు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో లైసెన్స్ వెపన్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో రవీంద్ర కుమార్ కు లైన్స్ డ్ ఆయుధం కూడా ఇచ్చారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో తన భార్యతో రవీంద్ర కుమార్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అతని భార్య ఇంటి నుంచి బయటికి వెళ్లి పోయి తన కుటుంబ సభ్యులకు దగ్గరికి వెళ్లింది.

ఈ రోజు ఉదయం భార్య అతనికి ఫోన్ కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, నాట్ రీచబుల్ రావడంతో కొంత అనుమానం రావడం జరిగింది. మధ్యాహ్నం అతను ఉంటున్న 57 విల్లాకు వచ్చి చూడగా రవీంద్ర కుమార్ శవమై కనిపించాడు. దీంతో అందరూ శకోసంద్రం అయ్యారు. ఇద్దరి మధ్య గొడవ కావడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి పోవడంతో మనస్తాపం చెందిన రవీంద్ర కుమార్ తన దగ్గరున్న గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఘటనాస్థలికి చేరుకున్న జవహర్ నగర్ ఏసీపీ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చింది..? కుటుంబ తగాదలే ప్రధానంగా కారణమా? లేకపోతే ఆర్థిక ఇబ్బందులా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి ప్రాసెస్ పూర్తయ్యాక డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.