United Nations Drugs and Crime report: ఆఫ్ఘానిస్థాన్‌లోనే నల్లమందు ఉత్పత్తి..ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదికలో వైల్లడైన సంచలన వాస్తవాలు
ప్రపంచంలోనే ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 80శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోందా? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక. ప్రపంచంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది....

Global Opium Production
United Nations Drugs and Crime report: ప్రపంచంలోనే ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 80శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోందా? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక. ప్రపంచంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది. (Global Opium Production) ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 3.5 మిలియన్ల మంది ప్రజలు మాదకద్రవ్యాలు వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ఆఫ్ఘాన్(Afghanistan) దేశ మొత్తం జనాభాలో 10 శాతం మంది మాదకద్రవ్యాలకు బానిసలని తేలింది.
గసగసాల సాగును నిషేధించామంటున్న తాలిబన్లు
కాగా ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదికలోని అంశాలను తాలిబన్(Taliban) అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. అఫ్ఘానిస్థాన్ దేశంలో గసగసాల ఉత్పత్తిపై లెక్కలు తేల్చలేదని జబివుల్లా చెప్పారు. గసగసాల సాగును తమ దేశంలో నిషేధించి రెండేళ్లు కావస్తుందని, దీంతో దేశంలో ఒక్కశాతం కూడా గసగసాల సాగు చేయడం లేదని జబీవుల్లా చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదికలోని అంశాలు సరైనవి కావని ఆయన చెబుతున్నారు.
గసగసాల సాగు, డ్రగ్స్ ఉత్పత్తి, రవాణా
అఫ్ఘానిస్థాన్ దేశంలో గసగసాల సాగు, డ్రగ్స్ ఉత్పత్తి, రవాణా చేయడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ ఉంటేనే దీన్ని నివారించవచ్చని రాజకీయ విశ్లేషకులు వైస్ నసేరి చెప్పారు. మాదకద్రవ్యాల సాగు, రవాణాను అప్ఘాన్ దేశంలో తగ్గించాలంటే అంతర్జాతీయ సమాజం సహకారం అవసరమని మరో రాజకీయ విశ్లేషకులు హసన్ హక్యార్ చెప్పారు. అంతర్జాతీయ సమాజం మాదకద్రవ్యాల నిరోధం విషయంలో ఆఫ్ఘనిస్థాన్ దేశానికి సహాయం చేయడం లేదని హసన్ ఆరోపించారు.
పెరిగిన గసగసాల సాగు విస్తీర్ణం
ఆఫ్ఘాన్ దేశంలోని దక్షిణాది రైతులు వేసిన గసగసాల పంటలను తాలిబాన్ అధికారులు ధ్వంసం చేశామని చెబుతున్నారు. గసగసాల పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును అందించి తమను ఆదుకోవాలని ఆఫ్ఘాన్ రైతులు పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆఫ్ఘాన్ దేశంలో నల్ల మందు తయారీకి వాడే గసగసాల సాగు గత ఏడాది కంటే 32 శాతం పెరిగింది. దేశంలో 2,33,000 హెక్టార్లలో గసగసాల సాగు అవుతోందని నివేదిక నిగ్గు తేల్చింది. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి గసగసాల సాగును నిషేధించినా దీన్ని సాగు మాత్రం ఆగటం లేదు.
నల్లమందు ప్రపంచవ్యాప్తంగా రవాణ
అప్ఘాన్ దేశం నుంచే 80 శాతం నల్లమందు ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2022వ సంవత్సరంలో గతంలో కంటే 32 శాతం గసగసాల సాగు విస్తీర్ణం పెరిగిందని నివేదిక తేల్చి చెప్పింది. అఫ్ఘాన్ దేశంలోని హిల్ మండ్, కాందహార్, బద్గీస్, ఉరుజ్ గాన్, ఫరా, నంగార్ హర్, నిమ్రోజ్, ఫర్యాబ్ ప్రాంతాల్లో గసగసాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
అఫ్ఘాన్ నుంచి డ్రగ్స్ ఎగుమతి
నల్లమందుతో పాటు అఫ్ఘాన్ నుంచి 350 నుంచి 580 టన్నుల హెరాయిన్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నల్లమందు, హెరాయిన్ డ్రగ్స్ ఉత్పత్తి, విక్రయం, ఎగుమతి అఫ్ఘాన్ దేశంలో సాగుతుందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించడం సంచలనం రేపింది.